Kakani Govardhan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఊరట లభించింది.. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో కాకాణి గోవర్ధన్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది నెల్లూరు నాల్గో అదనపు కోర్టు.. అయితే, ఈ కేసులో కాకాణికి బెయిల్ వచ్చినా.. ఇంకా జైలులోనే ఉండాల్సిన పరిస్థితి.. ఎందుకంటే.. మరో నాలు కేసుల్లో నిందితుడిగా ఉన్నారు.. మిగిలిన నాలుగు కేసుల్లో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసినట్టు ఆయన తరపు న్యాయవాదులు తెలిపారు.. మరోవైపు, కృష్ణపట్నం సమీపంలో అనధికార టోల్గేట్ ఏర్పాటు చేసి అక్రమ వసూళ్లకు పాల్పడ్డ కేసులో రెండు రోజులపాటు కష్టడీకి అనుమతి ఇచ్చింది కోర్టు.. ఈ నెల 30వ తేదీ నుంచి రెండు రోజులు పాటు కాకాణి గోవర్ధన్‌రెడ్డిని విచారించనున్నారు ముత్తుకూరు పోలీసులు.. మొత్తంగా.. ఓ కేసులో బెయిల్ వచ్చినా.. మరో నాలుగు కేసుల్లో బెయిల్ రాకపోవడంతో.. రిమాండ్ ఖైదీగానే ఉండనున్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి..
Read Also: Jagannath Rath Yatra: జై జగన్నాథ్.. కనులవిందుగా పూరి రథయాత్ర.. మంత్రముగ్ధులను చేసే ఫోటోలు..