మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఊరట లభించింది.. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో కాకాణి గోవర్ధన్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది నెల్లూరు నాల్గో అదనపు కోర్టు.. అయితే, ఈ కేసులో కాకాణికి బెయిల్ వచ్చినా.. ఇంకా జైలులోనే ఉండాల్సిన పరిస్థితి..
నెల్లూరు కోర్టులో దొంగలు పడడం కలకలం సృష్టించింది.. ఈ కేసును ఛేదించిన పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేశారు.. అయితే, నెల్లూరు ఎస్పీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ.. నెల్లూరు కోర్టులో కాకాని ఫైల్ మాత్రమే దొంగలు ఎలా దొంగతనం చేస్తారు..? అని ప్రశ్నించారు.. ఎన్నో ఫైళ్లు ఉండే కోర్టులో ఒక కాకాని ఫైల్ మాత్రమే దొంగలకు దొరికిందా..? నెల్లూరు ఎస్పీ ఖాకి డ్రెస్ వేసుకున్నారా..? లేదా..? అనే అనుమానం కలుగుతోంది అంటూ ఆగ్రహం వ్యక్తం…
బీజేపీ ప్రజల నుంచి ఒంటరవుతోంది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనం. మొన్నటి ఐదురాష్ట్రాల ఎన్నికల్లోనూ చావు తప్పి కన్నులొట్టబోయి బయట పడిందన్నారు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు. రాబోయే కాలంలో మత పరంగా ప్రజలను విభజించి అధికారంలోకి రావాలని చూస్తోంది. శ్రీరామనవమి, హనుమాన్ జయంతిలను ఘర్షణలకు ఉపయోగించుకుంది. రాబోయే కాలంలో ఇవి మరింత పెరిగే అవకాశం ఉంది. లౌకిక శక్తులన్నీ కలిసొచ్చి మతోన్మాదానికి వ్యతిరేకంగా కలిసి రావాలన్నారు. బీజేపీ మతోన్మాద శక్తులకు…
నెల్లూరు కోర్టులో కీలక పత్రాల చోరీ కేసు తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. మిగిలిన నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ కేసు వివరాలను తాజాగా నెల్లూరు ఎస్పీ విజయారావు మీడియాకు వెల్లడించారు. శాస్త్రీయంగా పరిశోధన చేసి ఈ కేసును ఛేదించామని తెలిపారు. అన్నింటికీ డిజిటల్ ఆధారాలు ఉన్నాయన్నారు. కోర్టులో చోరీకి గురైన అన్నింటినీ రికవరీ చేశామని…
నెల్లూరు కోర్టులో చోరీ వ్యవహారంపై టీడీపీ సీనియర్ నేత, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ స్పందించారు. నెల్లూరు కోర్టులో చోరీ వ్యవహారాన్ని హైకోర్టు చాలా సీరియస్‌గా తీసుకోవాలని పయ్యావుల కేశవ్ సూచించారు. అసలు కోర్టులో దొంగలు ఎందుకు పడ్డారు.. దేని కోసం ఈ దొంగతనం జరిగిందో చూడాలన్నారు. మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి ఏ1గా ఉన్న కేసులో డాక్యుమెంట్లు చోరీ కావడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. కోర్టులో దొంగతనం అనేది దేశంలో ఇప్పటి వరకు జరగలేదని.. ఇదే తొలిసారి…