MLA Vemireddy Prashanthi Reddy Slams YS Jagan: మహిళలను కించపరిచే వ్యక్తులను పరామర్శిస్తూ.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు? అని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మండిపడ్డారు. వైఎస్ జగన్ సైంధవుడిలా రాష్టాభివృద్ధిని అడ్డుకుంటుంటే.. అనిల్ కుమార్, ప్రసన్న కుమార్ రెడ్డిలు నెల్లూరు జిల్లా పాలిట సైంధవులయ్యారని విమర్శించారు. తల్లిని, చెల్లిని వేధించడం వైసీపీ సంస్కృతిలో భాగం అని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్…
నెల్లూరు సెంట్రల్ జైలు వద్దకు కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పరామర్శించడానికి వెళ్తుండగా.. హరిత హోటల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో.. పోలీసులు అలర్ట్ అయ్యారు.. నల్లపురెడ్డి కుమార్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో.. కార్యకర్తలు దూసుకురాగా.. వైసీపీ కార్యకర్తల మీద లాఠిఛార్జ్ చేశారు పోలీసులు.. దీంతో, రోడ్డుమీద బైఠాయించారు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి..
Prashanthi Reddy vs Prasanna Kumar Reddy: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఓ మహిళ ఫిర్యాదుతో కోవూరు పోలీసులు మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. ఈరోజు ఉదయం పోలీసుల విచారణకు ప్రసన్న కుమార్ రెడ్డి హాజరయ్యారు. పోలీసులు ఆయన్ను మూడు గంటల పాటు విచారించారు. విచారణ అనంతరం ప్రసన్న కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తనను పోలీసులు…
Minister Anam: నెల్లూరు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఘాటుగా స్పందించారు. సభ్య సమాజం తలదించుకునేలా మహిళ శాసన సభ్యురాలు ప్రశాంతి రెడ్డిపై వైసీపీ నాయకుడు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు.
Minister Savitha: భారతదేశ మహిళలను ఇతర దేశాలలో కూడా గౌరవిస్తారు అని కడప జిల్లా ఇంఛార్జ్ మంత్రి సవిత సవిత తెలిపారు. కానీ, మహిళా రైతులు అమరావతి నుంచి తిరుపతికి పాదయాత్రగా వెళ్లినప్పుడు ఎలా అసభ్యకరంగా మాట్లాడారో అందరికీ తెలుసు అని పేర్కొన్నారు.
అనిల్ కుమార్ మాట్లాడుతూ.. 200 మందికి పైగా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై పెద్ద పెద్ద మారణాయుధాలతో దాడి చేశారు అని ఆరోపించారు. ఆయన్నీ హతమార్చేందుకు ప్రయత్నం చేశారు.. ఇంట్లో ఉన్న ప్రసన్న తల్లి షాక్ కు గురై ఏదైనా అయ్యుంటే ఎవరిది బాధ్యత అన్నారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, పార్లమెంటు సభ్యులు ప్రభాకర్ రెడ్డి, అనుచరుల పైనా హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై ప్రసన్నకుమార్ చేసిన వ్యాఖ్యలపై సీరియస్‌గా స్పందించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్న ఆయన.. మహిళల వ్యక్తిత్వాన్ని అవహేళన చేస్తూ కించపరచే వ్యాఖ్యలు చేయడం వైసీపీ నాయకులకు ఒక అలవాటుగా మారిపోయిందని మండిపడ్డారు.
మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడికి తనకి ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి స్పష్టం చేశారు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి.. తన క్యారెక్టర్ గురించి మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అసభ్యకరంగా మాట్లాడారు.. ఇప్పటికి ఎన్నోసార్లు తన క్యారెక్టర్ పై తీవ్రమైన విమర్శలు చేసినా.. నేనెక్కడా సహనం కోల్పోలేదన్నారు.. తనపై వ్యక్తిగత విమర్శలు వేసిన ప్రసన్న కుమార్ రెడ్డిపై మహిళా కమిషన్ కి…
ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ప్రసన్నకుమార్ రెడ్డి.. జిల్లా చరిత్రలో ఈ తరహా దాడులు గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు.. అయితే, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తనను వ్యక్తిగతంగా దూషించడం వల్లే నేను కౌంటర్ ఇచ్చాను అన్నారు.. అంతేకాదు, ప్రశాంతి రెడ్డి మీద చేసిన ప్రతి విమర్శకు కట్టుబడి ఉన్నానని ప్రకటించారు..
నెల్లూరు జిల్లాకు తెలుగంగ ప్రాజెక్టును తీసుకువచ్చిన ఘనత మా తండ్రిదే.. మహిళలంటే మాకు చాలా గౌరవం.. నమ్ముకున్న వారిని మోసం చేయడం చంద్రబాబు నైజం అని ఆయన ఆరోపించారు. కోవూరులో మూడు సంవత్సరాల పాటు దినేష్ రెడ్డిని తిప్పారు.. టికెట్ కూడా ఇస్తానని హామీ ఇచ్చారు.