లోక్‌సభ ఎన్నికల్లో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పోటీ చేస్తున్నారు. ఈ మేరకు ఆమెకు హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ టికెట్ ప్రకటించింది. ఆదివారం ప్రకటించిన 111 మంది అభ్యర్థుల జాబితాలో కంగనా పేరు ఉంది. అయితే ఆమెకు బీజేపీ సీటు ప్రకటించడంపై హిమాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ స్పందించింది. కంగనా గెలిస్తే.. మూడింట ఒక వంతు సమయం కూడా నియోజకవర్గంలో ఉండరని మంత్రి విక్రమాధిత్య సింగ్ తెలిపారు.
అభ్యర్థుల ఎంపిక బీజేపీ అంతర్గత వ్యవహారం అని మంత్రి తెలిపారు. అభ్యర్థిగా ప్రకటించడంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయమన్నారు. ఆమె సినిమాల్లో నటించి పలు అవార్డులు అందుకున్నారు… అలాగే హిమాచల్‌ప్రదేశ్‌కు కూడా పేరు తెచ్చారని గుర్తుచేశారు. కానీ ఇది రాజకీయ రంగం.. ఆమెకు సినిమా రంగమే ప్రాముఖ్యం.. అలాంటప్పుడు గెలిచాక కనీసం మూడింట ఒక వంతు సమయమైనా హిమాచల్‌ప్రదేశ్‌కు కేటాయించగలరా? అని మంత్రి సందేహం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Surabhi : సింగర్‌ని పెళ్లి చేసుకున్న హీరోయిన్..
అయినా స్టార్‌డమ్‌తో రాజకీయాలు చేయటం అంత సులభం కాదని హితవు పలికారు. బీజేపీ.. కంగనా స్టార్‌డమ్ మీదే ఆధారపడుతోందని మంత్రి విమర్శించారు. కేవలం స్టారడమ్ ఆధారంగా ఆమె అభ్యర్థిగా బరిలో దింపటం సరికాదని పేర్కొన్నారు. ఆమె ప్రాధాన్యం ఎప్పుడూ బాలీవుడ్ సినిమా పరిశ్రమేనన్నారు. గెలిచినా లేదా ఓడినా రాజకీయాలు ఆమెకు తొలి ప్రాధాన్యం కాదని.. అందుకే మండి నియోజకవర్గం ప్రజలు పూర్తిగా మీకు అందుబాటులో ఉండే నేత కావాలా? లేదా స్టార్‌డమ్ ఉన్న వాళ్లకు ఓటు వేస్తారో నిర్ణయించుకోవాలని ప్రజలకు మంత్రి విక్రమాధిత్య విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం మండి నియోజకవర్గం ఎంపీగా హిమాచల్ ప్రదేశ్ పీసీసీ చీఫ్ ప్రతిభా సింగ్ ఉన్నారు. అయితే ఆమె ఇటీవల తాను వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు. కంగనాకు బీజేపీ టికెట్ ప్రకటించటంపై ప్రతిభా సింగ్ కూడా స్పందించారు. ఆమెకు ఎంపీగా పోటీ చేసే అవకాశం లభించినందుకు సంతోషం.. కానీ ఆమె ఒక సినిమా సెలబ్రిటీ అని చెప్పుకొచ్చారు. ఆమె ఇంత సడన్‌గా రాజకీయాల్లోకి వచ్చి ఎలాంటి పాత్ర పొషిస్తారో చూస్తా్మని ప్రతిభా సింగ్ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Kesineni Nani: బెజవాడ పశ్చిమ సీటుపై ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు..