Anil Ambani: నెల్లూరులో అనిల్ అంబానీ పర్యటన.. పవర్ ప్లాంట్ భూముల పరిశీలన
- నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో అనిల్ అంబానీ పర్యటన..
- కృష్ణపట్నం గ్రామంలో పవర్ ప్లాంట్ భూముల పరిశీలన..
- కోస్టల్ ఆంధ్ర పవర్ లిమిటెడ్ కంపెనీకి గతంలో భూ కేటాయింపులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anil Ambani: నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో కోస్టల్ ఆంధ్ర పవర్ లిమిటెడ్ కంపెనీకి కేటాయించిన భూములను జిల్లా రెవెన్యూ అధికారులతో కలిసి రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ అంబానీ పరిశీలించారు. అనిల్ అంబానీ పర్యటనను అధికారులు గోప్యంగా ఉంచారు. కంపెనీ ప్రతినిధులతో కలిసి అనిల్ అంబానీ.. కృష్ణపట్నంకు చేరుకున్నారు. కృష్ణపట్నం పోర్టుకు సమీపంలోని ఈ ప్రాంతం వద్ద విద్యుత్ పవర్ ప్లాంట్ స్థాపన కోసం గతంలో 2 వేల700 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం అనిల్ అంబానీ సంస్థకు కేటాయించింది. కానీ, నిర్ణీత వ్యవధిలో విద్యుత్తు ప్లాంట్ పనులను చేపట్టకపోవడంతో ఆ భూములను వెనక్కి తీసుకుంటామని ప్రభుత్వం అనిల్ అంబానీకి నోటీసులు జారీ చేసింది. మారిన పరిస్థితుల్లో విద్యుత్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం లాభదాయకత కాదని కంపెనీ ప్రతినిధులు ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఆ భూములను ప్రత్యామ్నాయ పరిశ్రమలకు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో అనిల్ అంబానీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. విద్యుత్ ప్లాంట్ స్థానంలో ఇతర పరిశ్రమలను స్థాపిస్తామని అనిల్ అంబానీ యోచిస్తున్నారు. తాను ఏర్పాటు చేయ తలపెట్టిన పరిశ్రమల గురించి అధికారులతో చర్చించినట్టు తెలిసింది.
Read Also: CM Chandrababu: భారతీయుల గోల్డెన్ ఎరా మొదలైంది.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
Also Read
- AO M*urder Case: ఏవో శ్రీహరి హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. నిందితుడి ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య..
- CM Chandrababu: 'మావిగన్ అంటే నాకే అర్థం కావడం లేదు'.. జగన్పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు..
- Nellore: కోడూరు బీచ్లో విషాదం.. ముగ్గురు గల్లంతు.. బాలుడి మృతి
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!