Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Anam Venkata Ramana Reddy Made Strong Comments Against Ycp Mp Vijayasai Reddy

Anam Venkata Ramana Reddy: నెల్లూరు బిడ్డ వేమిరెడ్డి మాత్రమే.. విజయసాయి రెడ్ది కాదు

Published Date :March 26, 2024 , 3:55 pm
By Rajesh Veeramalla
Anam Venkata Ramana Reddy: నెల్లూరు బిడ్డ వేమిరెడ్డి మాత్రమే.. విజయసాయి రెడ్ది కాదు
  • Follow Us :
  • google news
  • dailyhunt

వైసీపీపై టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణా రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎంపీ, కీలక నేత విజయసాయి రెడ్డిపై విమర్శలు గుప్పించారు. విజయసాయి రెడ్ది బ్రోకర్, ఆర్ధిక ఉగ్రవాది అని విరుచుకుపడ్డారు. రాజశేఖర్ రెడ్ది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోపిడీలో ముద్దాయి సాయిరెడ్డి.. అందుకే జైలుకి వెళ్లారని ఆరోపించారు. సాయిరెడ్డికి వ్యాపారాలు లేవంటే నెల్లూరు ప్రజలు నమ్మరు.. వారి చెవ్వుల్లో పువ్వులు లేవని వ్యాఖ్యానించారు. వేణుంబాక ఫౌండేషన్ 13 ఏళ్లలో రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు.. విజయసాయి రెడ్ది సేవ చేశానని చెప్పడం అబద్ధం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Prakash Raj:ప్రకాష్ రాజ్ పుట్టిన రోజు… వైరల్ అవుతున్న వీడియో..!

వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్ది జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో సొంత నిధులు ఖర్చు చేసిన ఆధారాలు ఉన్నాయని ఆనం వెంకట రమణా రెడ్డి తెలిపారు. ఎంపీ ల్యాండ్స్ కింద సాయి రెడ్డి నెల్లూరు జిల్లాలో పదేళ్లలో రూపాయి అయినా ఖర్చు చేశారా అని ప్రశ్నించారు. నెల్లూరు బిడ్డ వేమిరెడ్డి మాత్రమే.. విజయసాయి రెడ్డి కాదన్నారాయన. వేమిరెడ్డి కులమతాలకు అతీతంగా విద్య, వైద్యం, తాగు నీరు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారని పేర్కొన్నారు. రూ. 2.16 కోట్లతో స్విమ్స్ ఆసుపత్రికి క్యాన్సర్ వైద్యం కోసం వాహనం కొనిచ్చాడు.. శ్రీశైలం ఆలయానికి రూ. 11 కోట్లతో బంగారు రథం బహుకరించిన సేవా మూర్తి వీపీఆర్ అని కొనియాడారు. చర్చి, మసీదు, ఆలయాలకు ఆర్ధిక సహయం చేస్తూ.. సేవా కార్యక్రమాలు చేస్తున్నారని పేర్కొన్నారు.

Geomagnetic Storm: భూమిని తాకిన “సౌరతుఫాన్”.. 6 ఏళ్లలోనే అతిపెద్దది..

అదాన్ డిస్టలిరీస్ కంపెనీకి జగన్ లాబీ చేయలేదా అని ఆనం వెంకట రమణా రెడ్డి మండిపడ్డారు. సాయి రెడ్ది మద్యం కంపెనీతో ఎందరో తాళి బొట్లు తెగాయి.. నవంబర్ 2022లో శరత్ చంద్రా రెడ్డిని ఇరికించిన మాట వాస్తవం కాదా అని పేర్కొన్నారు. సాయి రెడ్డి దొంగ అని ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఛార్టర్డ్ అకౌంట్స్ వాళ్లే చెప్పారు.. సాయిరెడ్డి ఛార్టర్డ్ అకౌంట్ గా ఉండేందుకు అర్హుడు కాదనివాళ్లే తేల్చి చెప్పారన్నారు. బ్రెజిల్ అధ్యక్షుడుకి ఎందుకు శుభాకాంక్షలు పెట్టావు.. అక్కడ సాయిరెడ్డికి సంబంధాలు ఉన్నాయి కాబట్టి అని తెలిపారు. విశాఖ పోర్టుకు వచ్చిన కంటైనర్ ను కమ్మ సామాజిక వర్గానికి అంటగట్టారు.. జగన్ తో జైల్లో ఉన్న వాళ్లు అందరు నెల్లూరు వాళ్లేనని ఆనం వెంకట రమణా రెడ్డి పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anam Venkata Ramana Reddy
  • mp vijayasai reddy
  • strong comments
  • tdp
  • telugu news

తాజావార్తలు

  • Call Off Strike: ప్రభుత్వంతో చర్చలు సఫలం.. తాత్కాలికంగా సమ్మె బ్రేక్..! ఆసుపత్రుల బకాయిల క్లియరెన్స్‌కు గ్రీన్ సిగ్నల్..

  • UP: పొలాల్లో హఠాత్తుగా దిగిన 3 సైనిక హెలికాపర్టు.. బెంబేలెత్తిపోయిన గ్రామస్తులు

  • Highest Grossing Indian Movies: 2 తెలుగు సినిమాలు సహా హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన టాప్ 5 ఇండియన్ సినిమాలివే!

  • Most Expensive Players: కోట్లు కుమ్మరించి కొన్నారు.. ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు!

  • Manipur Violence: మణిపూర్‌లో యుద్ధ వాతావరణం.. పలు జిల్లాల్లో కర్ఫ్యూ.. ఇంటర్నెట్ బంద్!

ట్రెండింగ్‌

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions