Kakani Govardhan Reddy: యూరియా పేరుతో భారీ స్కామ్ జరిగింది.. రెండు వందల కోట్ల మేర చేతులు మారాయని ఆరోపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన. చంద్రబాబు మాటలు ప్రకటనలకే పరిమితం .. యూరియా కొరత ఉండదని రైతులు ఆందోళనలు చేస్తున్నా.. చర్యలు శున్యం అన్నారు.. క్షేత్రస్థాయిలో యూరియా దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. రైతులు ఎదుర్కొటున్న సమస్యలు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడుకి క్యాజువల్ గా అనిపిస్తుందని మండిపడ్డారు.. యూరియా కోసం రైతులు క్యూలో నిలబడితే తప్పేంటని అవమానకరంగా అచ్చెన్నాయుడు మాట్లాడటం దారుణం అన్నారు.. రైతు ప్రయోజనాలను పణంగా పెట్టి ప్రైవేట్ డీలర్లకు యూరియా ఎందుకు ఇస్తున్నారు..? అని ప్రశ్నించారు.. బ్లాక్ మార్కెట్ ను నియంత్రించకపోవడంలో ఆంతర్యం ఏంటి? అని నిలదీశారు.. యూరియా పేరుతో భారీ స్కాం జరిగింది.. రెండు వందల కోట్ల మేర చేతులు మారాయని ఆరోపించారు.. 270కి రావాల్సిన బస్తా యూరియా.. 400 నుంచి 600 ధర పలుకుతుంది.. రైతులకు యూరియా అందించడంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని ఫైర్ అయ్యారు.. ఈ పరిస్థితిపై చంద్రబాబు నాయుడు ప్రజలకు సమాధానం చెప్పి తీరాలన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.
Read Also: Gold Rate Today: భగ్గుమంటున్న బంగారం.. లక్షా పది వేల దిశగా పరుగులు!