టీడీపీలో ఆ నలుగురు నేతలకు చంద్రబాబు టానిక్ బాగా పనిచేసిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూడేళ్ల క్రితం వరకు ఆ జిల్లాలో టీడీపీ ఓ వెలుగు వెలిగింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ కకావికలం. నాడు కీ రోల్ పోషించిన నాయకులు పత్తా లేకుండా పోయారు. అధినేత ఆదేశాలతో ఫీల్డ్‌లోకి మళ్లీ ఎంట్రీ ఇస్తున్నట్టు కనిపిస్తోంది. ఆ నలుగురు పోరాటాలకు సిద్ధమయ్యారని టాక్. ఇంతకీ ఎవరా నాయకులు?
స్వయంకృతాపరాధంతో హారతి కర్పూరమైన టీడీపీ ప్రతిష్ట!
Also Read
- MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
- CM Chandrababu : వచ్చే కాన్ఫరెన్స్ నాటికి 100 శాతం కనెక్టివిటీ ఉండాల్సిందే
- CM Chandrababu : కలెక్టర్లకు చంద్రబాబు బిగ్ టార్గెట్.. న్యూ ఏజ్ గవర్నెన్స్‌పై ఫోకస్
- Bolishetti Srinivas: ఎమ్మెల్యే బొలిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ వల్లే కాపులకు విలువ.. 50-60 సీట్ల లక్ష్యం..!
గుంటూరు జిల్లాను గతంలో తమ అడ్డాగా చెప్పుకొన్న టీడీపీ.. వైసీపీ గాలిలో ఆ అడ్రస్‌ను గల్లంతు చేసుకుంది. వైఎస్ హయాంలో 2004, 2009 ఎన్నికల్లో ఒకసారి.. 2019 ఎన్నికల్లో జగన్ హవాలో మరోసారి సైకిల్ జిల్లాలో కుదేలైంది. మధ్యలో 2014లో ఊపిరి తీసుకున్నా.. అది మూణ్ణాళ్ల ముచ్చటే అయింది. టీడీపీ స్వయంకృతాపరాధంతో పార్టీ ప్రతిష్ట హారతి కర్పూరమైంది.
అప్పట్లో చంద్రబాబు పాదయాత్రకు అండగా ఉన్నారు!
2012లో టీడీపీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో చంద్రబాబు చేపట్టిన ఆత్మగౌరవ యాత్రను గుంటూరుజిల్లా నేతలు ముందుండి నడిపించారు. పల్నాడులో యరపతినేని శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావులు యాత్రను పర్యవేక్షిస్తే.. డెల్టాలో ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనందబాబులు చూసుకున్నారు. ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉండటంతో నాటి పరిస్థితులను ఇటీవలే చంద్రబాబు దగ్గర ప్రస్తావించారట టీడీపీ నేతలు. దీంతో పల్నాడు వేదికగా ప్రజా పోరాటాన్ని చేపడితే దానికి వస్తానని చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. అప్పట్లో పాదయాత్రలో అండగా ఉన్న నాయకులే మరోసారి సాయం పట్టాలని అధినేత కోరారట.
చంద్రబాబు హితోక్తులు పనిచేశాయా?
చంద్రబాబు చేసిన హితోక్తులు పనిచేశాయో ఏమో.. యరపతినేని శ్రీనివాసరావుతోపాటు.. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తిరిగి యాక్టివ్ అయ్యారు. ఏ చిన్న సమస్య వచ్చినా ఇద్దరూ డైరెక్ట్‌గా స్పాట్‌కు వెళ్లి కేడర్‌కు ధైర్యం చెబుతున్నారు. ఇద్దరూ కార్యకర్తలతో సమావేశాలు పెట్టి రాజకీయంగా వేడి పుట్టించే కామెంట్స్ చేస్తున్నారు.
ఎన్నికల వరకు ఇదే స్పీడ్ కొనసాగిస్తారా?
మాజీ మంత్రులు నక్కా ఆనందబాబుకు మాజీ మంత్రి ఆలపాటి రాజా తోడు కావడంతో డెల్టాలో టీడీపీ బలం పెంచే వ్యూహాలు రచిస్తున్నారట. పల్నాడులో ఆ ఇద్దరు.. డెల్టాలో ఈ ఇద్దరు నేతల దూకుడు చూసిన తర్వాత చంద్రబాబు టానిక్ బాగానే పనిచేసిందని కేడర్ నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండేళ్లకుపైగా సమయం ఉండటంతో అప్పటి వరకు ఇదే స్పీడ్ కొనసాగిస్తారా లేదా అన్నది ప్రశ్న. పైగా చంద్రబాబు కోసం కంటి తుడుపు చర్యలు చేపడుతున్నారా లేక క్షేత్రస్థాయిలో ఉండి పోరాటం చేస్తారా అన్నదానిపై కొందరిలో సందేహాలు ఉన్నాయట. జిల్లాలో గత ఎన్నికల్లో రెండుచోట్లే టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. వారిలో ఒకరు వైసీపీకి జై కొట్టారు. ఈ తరుణంలో ఆ నలుగురి ప్రయోగం ఏ మేరకు టీడీపీకి ఫలితాన్నిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల అలర్ట్.. మూడు రోజులు జాగ్రత్త
-
Maharashtra: నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
-
IndiGo Flight: టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్‌లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
-
Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?