Perni Nani: చంద్రబాబుకు రాజకీయ నీతి గురించి మాట్లాడే అర్హత లేదు.. సీఎంపై పేర్ని నాని ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Perni Nani: చంద్రబాబు నాయుడు పొలిటికల్ ఎథిక్స్ గురించి మాట్లాడటం అత్యంత సిగ్గుచేటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. అసలు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి, పదవి నుంచి దింపేసి, టీడీపీని ఆయన దగ్గర నుంచి లాక్కున్న చంద్రబాబు.. ఈరోజు ఏ మొహం పెట్టుకుని ఎన్టీఆర్ విగ్రహాలకు దండలు వేస్తూ మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబుకు అసలు క్యారెక్టర్ గానీ, కనీస రాజకీయ సంస్కారం గానీ ఉందా అని నిలదీశారు. ఇటువంటి వ్యక్తి అనుభవం రాష్ట్రంలో ఎవరికి అవసరమని ఆక్షేపించారు. చంద్రబాబు సొంత తమ్ముడే ఆయనను నమ్మక కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలన్నారు. కూటమి ప్రభుత్వం సోషల్ మీడియాను కట్టడి చేసేందుకు ఏకంగా రూ. 210 కోట్లు ఖర్చు పెడుతోందని పేర్ని నాని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే వారి గొంతు నులిమేందుకు టాస్క్ ఫోర్స్, సబ్ కమిటీల పేరుతో వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు చేస్తున్న దోపిడీ, పాపాలు ప్రజలకు కనపడకూడదనే ఈ అణిచివేత అని.. గతంలోనూ అంగన్వాడీ కార్యకర్తలను గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబుదని గుర్తుచేశారు. రాజధానికి అవసరం లేకపోయినా పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లోని రైతులపై దుర్మార్గం చేస్తున్నారని, ఉండవల్లిలో జనసేనకు చెందిన రైతుల పొలాలను కూడా ధ్వంసం చేశారని ఆరోపించారు. అమరావతి రైతుల కన్నీటి గాథలను, విజయవాడ లాకప్ డెత్ దారుణాన్ని సోషల్ మీడియానే సమాజానికి చూపించిందని.. అందుకే ప్రశ్నించే వారిపై కక్షగట్టారని పేర్కొన్నారు. అక్రమ కేసులతో సోషల్ మీడియా కార్యకర్తలను ఒక నెల రోజులు జైల్లో ఉంచగలరేమో కానీ, కొత్త చట్టాలు తెచ్చినా తాము భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
గత రెండేళ్లలో ఈ కేబినెట్ ఒక్కటైనా ప్రజాహిత నిర్ణయం తీసుకుందా అని పేర్ని నాని ప్రశ్నించారు. చివరకు ఓటు వేసి గెలిపించిన మంగళగిరి ప్రజలకే లోకేష్ దొరకడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో పే స్లిప్పులతో సహా చూపించే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అని సవాల్ విసిరారు. ఒకవైపు ఆర్టీసీని అమ్మకానికి పెట్టేందుకు తలుపులు తెరుస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబును నమ్మి చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే సీఐ నాగరాజుకు పట్టిన గతే పడుతుందని ఇప్పుడు పోలీసులకు భయం పట్టుకుందన్నారు. చంద్రబాబు నిరంతరం అబద్ధాలు చెప్తున్నారని, ఆయనకు ఏమైనా మానసిక రుగ్మత ఉందో లేదో వైద్యులకు చూపించుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల చర్చల్లోకి వచ్చిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ జోసెఫ్ రావణ్ వ్యవహారంపై కూడా పేర్ని నాని స్పష్టతనిచ్చారు. రావణ్ అనే వ్యక్తి ఐడియాలజీకి తాము పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు. గతంలో రావణ్ అనే వ్యక్తితో వైఎస్ జగన్‌ను దారుణంగా తిట్టించారని గుర్తుచేశారు. ఆ రావణ్ అనే వ్యక్తి కేవలం వైఎస్ జగన్‌ను, పవన్ కళ్యాణ్‌ను మాత్రమే ఎందుకు విమర్శిస్తాడని.. చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణలను ఎందుకు ఒక్క మాట కూడా అనడో ప్రజలు గమనించాలన్నారు. తాడేపల్లి ప్యాలెస్ వేదికగా కుట్రలు జరుగుతున్నాయనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, చంద్రబాబు తన దోపిడీని కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి అబద్ధాలు ఆడుతున్నారని పేర్ని నాని మండిపడ్డారు.
Also Read
- ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?