Somu Veerraju: అందుకే రోడ్లు వేయరు, పంట కాలువలు, డ్రెయిన్లు క్లీన్ చేయరు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మరోసారి సెటైర్లు వేశారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. అభివృద్ధి కార్యక్రామాలు, ఓట్లకు లింకు పెట్టిన ఆయన.. అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఓట్లు రావని.. వాటిని లైట్‌గా తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి కాల్వల్లో పూడిక కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు.. పంట కాల్వల, డ్రెయిన్ల నిర్వహణ ఒక నిరంతర ప్రక్రియలా సాగాలని.. గత ప్రభుత్వం గానీ ఈ ప్రభుత్వం గానీ పూడికతీత అంశాన్ని నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు. పొలాల నుంచి డ్రెయిన్లలో పారే నీటిలో తప్పనిసరిగా సిల్టు ఉంటుంది.. అది కాల్వల్లో పేరుకుపోతుంది.. గుర్రపుడెక్క వంటి కలుపును వెంట వెంటనే తీయకపోతే విపరీతంగా వృద్ధిచెంది నీటి ప్రవాహాలను అడ్డుకుంటుందన్నారు. ఇవన్నీ ఇరిగేషన్ అధికారులకు తెలుసు, ప్రభుత్వాలకూ తెలుసు. కానీ, వాటికి నిధులు కేటాయించటం వృథా అనుకుంటున్నారు.. దానివల్ల ఓట్లు రావు.. పంచితే ఓట్లు వస్తాయన్న భావనతో పాలన సాగిస్తున్నారు.. అందుకే రోడ్లు వేయరు, పంట కాలువలు, డ్రెయిన్లు క్లీన్ చేయరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Viral: సొంత ప్రభుత్వంపైనే ఉద్యమం.. వైన్ షాపుపై పేడతో దాడిచేసిన మాజీ సీఎం..
Also Read
- Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
- AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
కనీసం వేసవిలో నరేగా నిధులతో ఈ పనులు చేసేలా ఉపాధి కూలీలను ప్రోత్సహించవచ్చు అని సలహా ఇచ్చారు సోము వీర్రాజు.. తూతూ మంత్రంగా పనులే చేసి ఆ నిధులు పంచుకోవాలి అని చూస్తున్నారు.. ఇంత దుర్మార్గం జరుగుతోంది కనుకనే రైతులు వరి వేయం అంటున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరవాలి.. ప్రభుత్వం పెద్ద బాధ్యతగా ఉంటే రాష్ట్రం ముందుకు వెళ్తుందన్నారు. ఉన్న నిధులనే పొదుపుగా, సక్రమంగా, అవినీతి రహితంగా వాడితే ఈ పనులన్నింటికీ నిధులు ఉంటాయి… అసలు ప్రభుత్వమే నిర్లక్ష్యంతో అసమర్ధతతో పూడిపోతే వీటిని పట్టించుకునేదెవరు? అని నిలదీశారు. రైతులతో కలసి ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకు వస్తామని ప్రకటించారు సోము వీర్రాజు.
తాజావార్తలు
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!