Somu Veerraju: బీజేపీకి ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేయడం సంచలనంగా మారింది.. రాజీనామా చేసే సమయంలో.. అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్‌ను టార్గెట్ చేసిన కన్నా.. బీజేపీని పార్టీలాగా కాకుండా.. ఏదో వ్యక్తిగత సంస్థలాగా నడుపుతున్నారు.. పార్టీలో చర్చించకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించిన విషయం విదితమే.. అయితే, కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలపై స్పందించడానికి నిరాకరించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. బాపట్ల జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కన్నా లక్ష్మీనారాయణ నాపై చాలా కాలం నుండి ఆరోపణలు చేస్తున్నారు.. కన్నా వ్యాఖ్యలపై అప్పుడు స్పందించలేదు.. ఇప్పుడు స్పందించాల్సిన అవసరం లేదన్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పధంలో నడవాలంటే బీజేపీ, జనసేన ప్రభుత్వ స్థాపన జరగాలని అన్నారు.. ఇక, ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో భారతదేశం ఎంతో అభివృద్ది చెందిందిన్న సోము వీర్రాజు.. ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలకు 60 శాతం నిధులను కేంద్రమే అందిస్తుందని మరోసారి చెప్పుకొచ్చారు..
Read Also: Nadendla Manohar: పదవుల్లో ఉన్నామని అహంకారంతో ఉంటే.. సాగనంపడం ఖాయం..
మరోవైపు.. విజయవాడ ఇంద్ర కీలాద్రిపై జరిగిన వారాహి పూజా సమయంలో బీజేపీతో కలిసి ఉన్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనను గుర్తుచేశారు సోము వీర్రాజు. కాగా, జనసేనతో తప్ప.. రాష్ట్రంలో మరో పార్టీతో పొత్తు ఉండబోదని.. కుటుంబ పార్టీలకు, కుటుంబ పాలనకు తాము వ్యతిరేకమని గతంలోనూ స్పష్టం చేశారు సోమువీర్రాజు.. అయితే, ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ ఎపిసోడ్ హాట్ టాపిక్‌గా మారిపోయింది.. గురువారం రోజు.. ఆయన బీజేపీకి రాజీనామా చేస్తూ.. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లెటర్ పంపగా.. ఆయన బాటలో మరికొందరు నేతలు ఇప్పుడు రాజీనామాలు చేస్తున్నారు. కాగా, బీజేపీకి రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణ.. తన అనుచరులతో కలిసి త్వరలోనే టీడీపీలో చేరతారనే ప్రచారం సాగుతోంది.. దీనికి సంబంధించి ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యిందంటున్నారు.