ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. రైతాంగం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఉచిత పంటల బీమా పథకం రాష్ట్రంలో నవ్వులాటగా మారింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు 98 శాతం కట్టగా 2 శాతం మాత్రమే రైతు కట్టే ఈ పథకాన్ని అటకెక్కించారు. ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇన్స్యూరెన్స్ (పంటల బీమా) రైట్ యాక్టు లేకుండా చేసింది. రైతుల హక్కులను జగన్ ప్రభుత్వం కాల రాసింది. 2020నుంచి కూడా…
ఏరువాకతో సాగుకు సన్నద్దమవుతున్న అన్నదాతకు అండగా, 2021 ఖరీఫ్ పంట నష్టపోయిన 15.61 లక్షల మంది రైతన్నలకు చెప్పిన మాట ప్రకారం క్రమం తప్పకుండా ఈ ఖరీఫ్ ప్రారంభంలోనే రూ. 2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో బటన్ నొక్కి రైతన్నల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతన్నలపై ఒక్క రూపాయి కూడా ఆర్ధిక భారం లేకుండా, రైతుల తరపున పూర్తి…
ఖరీఫ్-2020లో నష్టపోయిన పంటలకు నేడు వైఎస్ఆర్ పంటల బీమా కింద సాయం అందించనుంది జగన్ సర్కార్. ఇందులో భాగంగా 15.15 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 1,820.23 కోట్లు జమ చేయనుంది ఏపీ సర్కార్. ఇవాళ గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సిఎం కార్యాలయం నుంచి సిఎం జగన్ కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అయితే యాస్ తుఫాన్ కారణంగా నేటి పంటల భీమా సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ కు ఉత్తరాంధ్ర…