విశాఖలో దారుణం… శిశువు బతికి ఉండగానే ఖననానికి యత్నం
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖలో దారుణం చోటు చేసుకుంది. శిశువు బతికి ఉండగానే ఖననానికి యత్నించారు. కాన్వెంట్ జంక్షన్ లో ఉన్న చావుల మదం శ్మశాన వాటికలో ఈ ఘటన చోటు చేసుకుంది. ముక్కుపచ్చలారని శిశువును బతికి ఉండగానే పూడ్చేయాలని కోరుతూ శ్మశాన వాటికకు వచ్చారు నలుగురు వ్యక్తులు. కవర్లో ఉంచిన శిశువును పాతిపెట్టాలని కోరారని తెలిపారు శ్మశాన వాటిక సిబ్బంది. పాతిపెట్టేందుకు కవర్ తెరవగా శిశువు ఏడవటం ప్రారంభించిందన్నారు సిబ్బంది. బతికి ఉండగానే ఎందుకు ఖననం చేస్తున్నారని ప్రశ్నించగా.. ఆ నలుగురు వ్యక్తులు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. అనంతరం శిశువును సమీపంలోని హాస్పిటల్ లో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. కంచరపాలెం పోలీసులకు శ్మశాన వాటిక సిబ్బంది ఫిర్యాదు చెయ్యగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..