Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!
- శేషాచలం అడవుల్లో భారీ అగ్నిప్రమాదం
- జీవకోన ప్రాంతంలో వేగంగా వ్యాపిస్తున్న మంటలు
- గాలి వేగంతో అదుపులోకి రాని పరిస్థితి
- వన్యప్రాణులు, వృక్ష సంపదకు ముప్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Seshachalam Forest : పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి సమీపంలోని శేషాచల అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నగర శివార్లలోని జీవకోన అటవీ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, చూస్తుండగానే అడవి అంతటా విస్తరిస్తున్నాయి. ఎగిసిపడుతున్న మంటల ధాటికి అడవిలోని విలువైన వృక్షసంపద అగ్నికి ఆహుతవుతోంది.
గత కొద్ది రోజులుగా తిరుపతిలో ఎండల తీవ్రత విపరీతంగా పెరగడంతో, ఎండుగడ్డి రాపిడి వల్ల లేదా వేడి సెగలకు ఈ మంటలు అంటుకొని ఉంటాయని భావిస్తున్నారు. మంటల కారణంగా అడవి నుంచి దట్టమైన పొగ వెలువడి జీవకోన పరిసర ప్రాంతాలను కమ్మేసింది. దీంతో స్థానిక నివాసితులు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతూ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Also Read
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
- OTR: గూడూరు వైసీపీలో ఇంచార్జ్ మార్పు చిచ్చు.. నేతలను బుజ్జగించేందుకు మిథున్ రెడ్డి ఎంట్రీ
- Amaravati Land Pooling: అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్.. 1,654 ఎకరాల భూమి సమీకరణకు నోటిఫికేషన్..
అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. మంటలను అదుపు చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయితే, అడవిలో గాలి వేగం ఎక్కువగా ఉండటంతో మంటలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వేగంగా విస్తరిస్తున్నాయి. ఇది అటవీ అధికారులకు పెద్ద సవాలుగా మారింది.
ఈ కార్చిచ్చు కారణంగా అడవిలోని మూలికా సంపదతో పాటు వన్యప్రాణులకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంటలను ఆర్పేందుకు అదనపు బలగాలను రంగంలోకి దించే ప్రయత్నం చేస్తున్నారు.
తాజావార్తలు
-
OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీలలో థ్రిల్లర్ల నుంచి ప్రేమ కథల వరకు చూడాల్సిన సినిమాలు, సిరీస్ లు ఇవే..
-
Gold and Silver Prices Today: రక్షాబంధన్ వేళ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
-
Dhananjaya de Silva: అదే మాకు పెద్ద తలనొప్పి.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kangana Ranaut: కృతి వివాదం.. కంగనా పాత రక్షాబంధన్ పోస్ట్ వైరల్.. నెటిజన్ల నుంచి ఊహించని ప్రశ్నలు!
-
R Praggnanandhaa: చరిత్ర సృష్టించిన ఆర్. ప్రజ్ఞానంద.. గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు
ట్రెండింగ్
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్‌కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్‌ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్‌ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!