యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న చిత్రం వార్ 2. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏడాది ఆగస్టు 14 న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఎన్టీఆర్, హృతిక్ మధ్య భారీ యాక్షన్ ను చూసేందుకు అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్స్ ను అనుకున్న స్టేయిలో చేయడం లేదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ గతకొద్ది రోజులుగా అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు వారికోసం వార్ 2 నుండి బ్లాస్టింగ్ అప్డేట్ ఇచ్చింది యష్ రాజ్ ఫిల్మ్స్. ఈ చిత్రంలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో అదరగొట్టే డాన్స్ నంబర్ ఉంటుందని చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా అందుకు సంబంధించి ప్రోమో రిలీజ్ చేసింది. సలామ్ అనాలి అని సాగే ఈ ప్రోమోలో ఎన్టీఆర్, హృతిక్ డాన్స్ అదరగొట్టారు. అయితే ప్రోమోలోని ఫుల్ సాంగ్ ను థియేటర్ లోనే చూసి ఎంజాయ్ చేయాలని ఇప్పుడు జస్ట్ ప్రోమో మాత్రమే రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్. ఇద్దరు డాన్సింగ్ స్టార్స్ 70MM స్క్రీన్ పై డాన్స్ వేస్తుంటే ఆడియెన్స్ కు అదొక ఫీస్ట్ అనే చెప్పొచ్చు. అందుకోసమే ఫుల్ సాంగ్ ను థియేటర్స్ లోరిలీజ్ రోజు చూసి ఎంజాయ్ చేయండని భావిస్తున్నట్లుంది యష్ రాజ్ ఫిల్మ్స్. హిందీ, తెలుగు, తమిళ్ లో మరో ఏడు రోజుల్లో రిలీజ్ కానుంది వార్ 2.