వైసీపీ ముఖ్య నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. కర్నూలు నగరంలోని సిల్వర్ జూబ్లీ కాలేజీ వద్ద ఫ్లైఓవర్‌పై సజ్జల కాన్వాయ్ వాహనాలు వెళ్తుండగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో సజ్జల కాన్వాయ్ వాహనాలు స్వల్పంగా దెబ్బతినగా.. సజ్జల సురక్షితంగా బయటపడ్డారు. ఓ వైసీపీ నేత నివాసంలో వివాహానికి హాజరై సజ్జల తిరిగి స్టేట్ గెస్ట్ హౌస్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
కర్నూలులోని డోన్ రోడ్డులో శనివారం పత్తికొండకు చెందిన వైసీపీ నేత మురళీధర్‌రెడ్డి కుమార్తె వివాహం జరిగింది. ఈ వేడుకకు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వివాహనం అనంతరం స్టేట్ గెస్ట్ హౌస్‌కు చేరుకునే మార్గంలో స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్ వాహనాలు ఒకదానికొకటి అనూహ్యంగా ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో వైసీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.
Read Also: Nadendla Manohar: ఏపీలో సమస్యలకు సృష్టికర్త సీఎం జగనే