YSRCP: సజ్జల కీలక ప్రకటన.. పీకే సేవలను ఉపయోగించుకోవడం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణలో ఆయన టీఆర్ఎస్ పార్టీతో పనిచేస్తున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్‌ను కలిసి మంతనాలు కూడా జరిపారు. అయితే జాతీయ రాజకీయాల్లో ఆయన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరిగినా.. పలు రాష్ట్రాలలో ఇతర పార్టీలతో ఒప్పందాలు ఉన్న కారణంగా ఇది వర్కవుట్ కాదని తెలిసి వెనకడుగు వేశారు. ఈ మేరకు తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని ప్రశాంత్ కిషోర్ క్లారిటీ కూడా ఇచ్చారు.
అయితే ఏపీలో ప్రశాంత్ కిషోర్ గత ఎన్నికల్లో వైసీపీతో కలిసి పనిచేశారు. వచ్చే ఎన్నికలకు కూడా పీకేతోనే ఆ పార్టీ పనిచేస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై స్పందించారు. తాము ప్రశాంత్ కిషోర్ సేవలను వినియోగించుకోవడం లేదని ప్రకటించారు. ఆయన సేవలకు బదులుగా థర్డ్ పార్టీ సేవలను వినియోగించుకుంటున్నామని సజ్జల తెలిపారు. అలాగే ఏ పార్టీతోనూ పొత్తు లేకుండానే వచ్చే ఎన్నికల బరిలో దిగుతామని చెప్పారు. కాగా 2019 ఎన్నికల్లో పీకే వ్యూహాలను పకడ్బందీగా అమలు చేసిన వైసీపీ రికార్డు స్థాయిలో విజయకేతనం ఎగురవేసింది. తాజాగా మరో రెండేళ్లలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పీకే సేవలను వినియోగించుకోవడం లేదంటూ వైసీపీ ప్రకటన చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Also Read
- OTR : ఇంటింటికీ టీడీపి.. గోదావరి జిల్లాలో గ్లాస్ ఎమ్మెల్యేల గందరగోళం
- Chintada Ravi Kumar Arrest: పోలీసుల అదుపులో వైసీపీ నేత చింతాడ రవికుమార్.. సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు
- OTR : కోఆర్డినేటర్లు మారినా మారని నేతలు.. అనంతపురంలో టిడిపికి తప్పని తలనొప్పి?
- OTR : అధిష్టానం పిలుపుతో తగ్గిన బొండా.. వైసీపీ నేతలపై విరుచుకుపడటం వెనుక రీజన్ ఏంటి?
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!