CM Jagan: ఈనెల 28న 1.23 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జగనన్న భూ హక్కు, భూ రక్ష, కీలక ప్రాజెక్టులకు భూ సేకరణ, నాడు – నేడు, స్పందన కింద అర్జీల పరిష్కారం తదితర అంశాలపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో కనీసం 60శాతం ఉపాధి హామీ పనులను పూర్తిచేయాలన్నారు. కలెక్టర్లు ఈ మూడు నెలల్లో పనులు ముమ్మరంగా చేయడంపై దృష్టిపెట్టాలని సూచించారు. ప్రతి జిల్లాలో కూడా ప్రతిరోజూ కనీసం 1 లక్ష పనిదినాలు చేయాలన్నారు. నెలలో కనీసంగా 25 లక్షల పని దినాలు చేపట్టాలని హితవు పలికారు. అధికారులు విస్తృతంగా పర్యటనలు చేసి, సమీక్షలు చేసి ఈ లక్ష్యాలను సాధించాలని సీఎం జగన్ ఆదేశించారు.
అటు జగనన్న ఇళ్ల నిర్మాణానికి సంబంధించి సిమెంట్, స్టీలు, ఇసుక, మెటల్ సరఫరా సవ్యంగా సాగేలా నోడల్ అధికారికి బాధ్యతలు అప్పగించాలని సీఎం జగన్ తెలిపారు. దీనిపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. డిసెంబర్ నాటికి 4,545 డిజిటల్ లైబ్రరీల నిర్మాణం పూర్తి కావాలని తెలిపారు తొలిదశలో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణం చేయాలని అనుకున్నామని.. కానీ కోర్టు కేసుల కారణంగా 42,639 ఇళ్ల నిర్మాణం పెండింగులో పడిందన్నారు. ఈ కేసుల పరిష్కారం కోసం ప్రయత్నాలు చేయాలన్నారు. వీలు కాని పక్షంలో ప్రత్యామ్నాయ స్థలాలను ఎంపిక చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం అందాలని జగన్ తెలిపారు. దీనికి ఎంత ఖర్చు అయినా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
Also Read
- CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
- ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో 1.7 కేజీల బంగారం.. 8.6 కేజీల వెండి లభ్యం..?
- Godavari Water: ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. పాయకరావుపేటలో సీఎం చంద్రబాబు జలహారతి
- Amaravati Farmers: అమరావతి రైతులకు గుడ్‌న్యూస్.. రిటర్నబుల్ ప్లాట్లు కేటాయింపు
ఆప్షన్ 3 కింద ఇళ్ల నిర్మాణాన్ని ఈనెల 28న ప్రారంభిస్తున్నామని.. అదే రోజు 1.23 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు. అదే రోజున 1.79 లక్షల పీఎంఏవై, వైఎస్ఆర్ గ్రామీణ ఇళ్ల నిర్మాణం కూడా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇళ్ల నిర్మాణం కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న స్థానిక ప్రజా ప్రతినిధులను సత్కరిస్తామని పేర్కొన్నారు. ఏసీబీ, ఎస్ఈబీ, దిశ, సోషల్ మీడియా ద్వారా వేధింపుల నివారణ అంశాల్లో ప్రగతి ఆధారంగా ఎస్పీల పనితీరును మదింపు చేస్తామని జగన్ చెప్పారు.
తాజావార్తలు
-
Jeetendra Mishra: ‘రామ మందిర నిర్వహణ అద్భుతం.. జితేంద్ర మిశ్రా కితాబు
-
Ashok Kumar : ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో ట్విస్ట్.. అశోక్ కుమార్ సంచలన ఆరోపణలు
-
ICC Women’s Champions Trophy 2027: మహిళల క్రికెట్లో కొత్త చరిత్ర.. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం.. తేదీలు ఖరారు
-
Cyberabad Constable : సోషల్ మీడియాలో పోలీస్ కామెంట్స్.. కానిస్టేబుల్‌పై సీపీ వేటు
-
UN Warns: ముంబై, కోల్‌కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!