Sajjala Ramakrishna Reddy: అవకాశం ఉన్న అన్నిచోట్లా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు వైసీపీ పెద్ద పీట వేస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjala Ramakrishna Reddy Says YCP Giving Chance To Every Community: అవకాశం ఉన్న అన్నిచోట్లా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు వైసీపీ పెద్ద పీట వేస్తోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అందుకే వైసీపీకి ఆయా వర్గాల ఆదరణ లభిస్తోందని తెలిపారు. శుక్రవారం సచివాలయంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. కర్రి పద్మశ్రీ, కుంభా రవిబాబు చేత మండలి ఛైర్మన్ మోషేన్ రాజు ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఇవాళ్టితో శాసన మండలి సభ్యుల నియామక అంకం పూర్తయ్యిందన్నారు. మత్స్యకార కుటుంబం నుంచి కర్రి పద్మశ్రీ, ఎస్టీ నుంచి కుంభా రవిబాబుకు అవకాశం కల్పించారన్నారు. మొత్తం 43 ఎమ్మెల్సీ ఖాళీల్లో 18 మంది బీసీలు, 6 గురు ఎస్సీలు, నలుగురు మైనారిటీలు, ఒక ఎస్టీ అభ్యర్థికి జగన్ అవకాశం కల్పించారని చెప్పారు. సమాజ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్న నాయకుడు వైఎస్ జగన్ అని.. ఈ పంథాను వైసీపీ కొనసాగిస్తుందని అన్నారు. ఎంపికైన సభ్యులు తమ వర్గాల, సమాజ అభ్యున్నతి కోసం పని చేస్తారని ఆశిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు.
Loan App: లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలి.. రుణం తిరిగి ఇవ్వలేదని..
Also Read
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు కుంభా రవి, కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ.. తమకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం ఇచ్చిన బాధ్యతను తాము తూ.చ. తప్పకుండా నెరవేరుస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చట్ట సభల ద్వారా గొంతు వినిపించే అవకాశం ఇచ్చారని.. ఆధునిక సామాజిక సంస్కర్త వైఎస్ జగన్ అని కొనియాడారు. విద్య, వైద్యం వంటి కీలక రంగాల్లో పలు సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. 75 ఏళ్ళ తర్వాత మొదటిసారి మత్స్యకార మహిళకు మండలిలో అవకాశం ఇచ్చారన్నారు. కాగా.. ఈ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి సజ్జలతో పాటు డిప్యూటీ సీఎం రాజన్న దొర, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు హాజరయ్యారు.
Anil Pawar: చిన్నపిల్లలతో భిక్షాటన చేయిస్తూ.. జల్సాలు చేస్తున్న యువకుడు అరెస్ట్
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!