Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగిలిపోయిన మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియకు ఎక్సైజ్ శాఖ ముమ్మర చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్రంలోని 271 మద్యం షాపుల కేటాయింపునకు సంబంధించి రెండవ విడత నోటిఫికేషన్‌ను ఎక్సైజ్ శాఖ కమిషనర్ చామకూరి శ్రీధర్ విడుదల చేశారు. కొత్త మద్యం నూతన విధానంలో భాగంగా తొలి విడత లాటరీ ప్రక్రియ ముగిసిన అనంతరం, వివిధ కారణాల వల్ల మిగిలిపోయిన, లైసెన్సుదారులు వెనక్కి తగ్గిన దుకాణాలకు ఈ నోటిఫికేషన్ ద్వారా మళ్లీ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను సమర్పించవచ్చని అధికారులు వెల్లడించారు. అనంతరం ఈ నెల 21వ తేదీన ఉదయం 8 గంటల నుంచి పారదర్శకంగా లాటరీ పద్ధతి ద్వారా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. జిల్లాల వారీగా నోటిఫికేషన్ వివరాలను పరిశీలిస్తే.. వైఎస్సార్ కడప జిల్లాలో అత్యధికంగా 33 దుకాణాలకు నోటిఫికేషన్ జారీ కాగా.. ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో 24 దుకాణాలు ఉన్నాయి.
Also Read
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
గుంటూరు, తిరుపతి జిల్లాల్లో 19 చొప్పున, పశ్చిమ గోదావరిలో 17, ప్రకాశంలో 16, అనంతపురంలో 15 దుకాణాలకు నోటిఫికేషన్లు వెలువడ్డాయి. అలాగే అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో 13 చొప్పున, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో 12 చొప్పున, మార్కాపురంలో 11, శ్రీకాకుళంలో 10 దుకాణాలకు అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. కాకినాడ, నంద్యాల జిల్లాల్లో 8 చొప్పున, శ్రీ సత్యసాయి జిల్లాలో 7, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 6 షాపులు ఉన్నాయి.
ఏలూరు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో 5 చొప్పున, అన్నమయ్య జిల్లాలో 4, చిత్తూరులో 3 దుకాణాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. చివరగా అల్లూరి సీతారామరాజు, కర్నూలు, ఎన్టీఆర్ జిల్లాల్లో అత్యల్పంగా 2 చొప్పున మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ జారీ అయింది. దరఖాస్తుదారులు సంబంధిత ఎక్సైజ్ నిబంధనలను పరిశీలించి గడువులోగా దరఖాస్తులు పూర్తి చేయాలని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. ఈ రెండో దశ లాటరీ పూర్తయిన వెంటనే మద్యం సరఫరాను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
తాజావార్తలు
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
-
Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
-
Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
-
Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!