Sajjala Ramakrishna Reddy Responds On YS Avinash Reddy Bail: వైఎస్ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు అయ్యిందని.. న్యాయం, ధర్మం తేలిందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. బెయిల్, ముందస్తు బెయిల్ అనేది సాధారణంగా జరిగేదే అని.. కానీ ఇవాళ వచ్చిన జడ్జిమెంట్ ప్రత్యేకమని అన్నారు. వైఎస్ వివేకా హత్య విషయంలో ఓ సెక్షనాఫ్ మీడియాలో రకరకాల వార్తలు వేసి, టీడీపీని ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేశాయని ఆరోపించారు. ఓ సెక్షనాఫ్ మీడియా తన పరిధి దాటి వ్యవహరించిందని తీర్పులో చెప్పారని వెల్లడించారు. వైఎస్ వివేకాకు ఉన్న బలహీనతల వల్ల బయటకు చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇలాంటి పరిస్థితిని అడ్వాంటేజీగా తీసుకుని, వైఎస్ వివేకా హత్య విషయంలో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని చెప్పారు.
Mlc Kavitha: తెలంగాణ రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ ఘట్టం.. ఎదురెదురైన బండి సంజయ్, ఎమ్మెల్సీ కవిత
వైసీపీని జగన్ చెమటోడ్చి నిర్మించుకున్నారని.. వైఎస్సార్ లెగసీ నాది, జగన్‌ది కాదని వైఎస్ వివేకా పోటీ పడ్డారని.. కానీ చివరికి వైఎస్సార్ లెగసీ జగన్‌దేనని ప్రజలు తేల్చి చెప్పారని సజ్జల వివరించారు. ఆ తర్వాత వైసీపీలోకి వివేకా వస్తే.. జగన్ సాదరంగా ఆహ్వానించారని గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వివేకాను టీడీపీ ఓడించిందన్నారు. ఎంపీ అవినాష్ గెలుపు కోసం వివేకా కూడా ప్రచారం చేశారని, ఆ విషయం సునీతమ్మ కూడా చెప్పారని తెలిపారు. వ్యవస్థలను మేనేజ్ చేయడం వల్ల.. వివేకా కేసును ఇక్కడిదాకా తీసుకొచ్చారన్నారు. వైఎస్ వివేకా రాసిన లెటర్‌ని ఎందుకు దాచారని ప్రశ్నించారు. ఏ లైన్‌లో పోవాలని చెప్పారో.. ఆ లైన్‌లోనే సీబీఐ వెళ్లిందని వెల్లడించారు. ఇవాళ్టి తీర్పుతో ‘వాటీజ్ వాట్’ అనేది తేలిపోయిందని.. న్యాయం, ధర్మం తేలిందని ఉద్ఘాటించారు. వైసీపీని టార్గెట్ చేసుకుంటూ.. ఈ తరహా ప్రచారం వెనుక టీడీపీ ఎందుకుందో విచారణలో తేలిందని చెప్పారు. ఢిల్లీ పెద్దలు కోర్టులను ప్రభావితం చేస్తున్నారని టీడీపీ ఉద్దేశ్యమా..? జడ్జీలను కూడా కామెంట్లు చేస్తారా..? అని నిలదీశారు.
Man Stabs Daughter: దారుణం.. కన్నకూతురినే 25 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు..
2024 ఎన్నికలయ్యాక వైఎస్ వివేకా కేసు గురించి, సునీతమ్మ గురించి పట్టదని సజ్జల చెప్పుకొచ్చారు. సునీతమ్మ కుటుంబానికి ఏవో పొలిటికల్ యాంబిషన్స్ ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. వైఎస్ వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డికి బీటెక్ రవితో పరిచయాలు ఉన్నాయని.. వైఎస్ వివేకాను ఓడించినా, సునీతమ్మ వాళ్ల వైపే ఉన్నారని పేర్కొన్నారు. నాలుగేళ్లలో ఏం ఘోరాలు, నేరాలు జరిగాయని ప్రశ్నించారు. పేదలకు సంక్షేమం చేయడం నేరమా..? అని నిలదీశారు. ఏపీలో నేరాలు తగ్గాయన్నారు. జగన్ చేసే మంచి పనులన్నీ టీడీపీ దృష్టిలో నేరాలు, ఘోరాలేనని విమర్శించారు.