Sajjala Ramakrishna Reddy: అభ్యర్థుల మార్పు.. నచ్చచెప్పటానికి ప్రయత్నిస్తాం.. ఇమడలేని వారు వెళ్లిపోతారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ అధికార పార్టీ వైఎస్సార్ సీపీ వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను మార్చుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నేతలతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం జరిగిన సమీక్షలో పాల్గొన్న వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఇక సీఎం జగన్ సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తరచు జరిగే సమీక్షలే చేశామని, తమ ప్రభుత్వం చేసిన, చేయబోయే కార్యక్రమాల గురించి చర్చించామన్నారు.
Also Read: JC Prabhakar Reddy: పోలీసులకి ఖాకీ డ్రెస్సులు ఎందుకు..? వాళ్లను చూస్తే సిగ్గేస్తుంది..!
Also Read
- Bolishetti Srinivas: ఎమ్మెల్యే బొలిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ వల్లే కాపులకు విలువ.. 50-60 సీట్ల లక్ష్యం..!
- Botsa Satyanarayana Emotional: బొత్స సత్యనారాయణ కంటతడి.. వైసీపీ సమావేశంలో భావోద్వేగం
- YS Jagan: దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు..! డీఎస్సీ స్పోర్ట్స్ కోటాపై జగన్ సంచలన ఆరోపణలు
- Tirupati - Vijayawada Flight: తిరుపతి-విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసులు ప్రారంభం..
అలాగే జనవరిలో జరిగే అంబేద్కర్ ఆవిష్కరణ, మూడు వేల పెన్షన్ల పై చర్చించామని చెప్పారు. అదేవిధంగా గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ఇచ్చిన హమీల్లో అమలు చేసిన పూర్తి అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే వంటి అంశాలపై కూడా చర్చించామన్నారు. అలాగే రీజనల్ కోఆర్డినేటర్ల నేతృత్వంలో అభ్యర్థుల మార్పు వంటి అంశాలను కూడా చర్చించామన్నారు. పార్టీలో రకరకాల వ్యక్తులు ఉంటారని, వైసీపీ చాలా బలోపేతంగా ఉందన్నారు. నచ్చ చెప్పటానికి ప్రయత్నిస్తామని, అయినా ఇమడ లేకపోయిన వాళ్ళు వెళ్ళిపోతారన్నారు.
Also Reddy: Bigg Boss Telugu : ఇకపై అవి రద్దు.. కీలక నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్ నిర్వాహకులు..?
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినప్పుడు కూడా మా పార్టీలోకి ఇంకా బలమైన వాళ్ళు వస్తారు అనుకున్నామన్నారు. అయితే ఏ పార్టీలోనైనా అసంతృప్తులు సహజమన్న ఆయన తమ పార్టీ మంచి ఫామ్‌లో ఉందన్నారు. అందుకే పోటీ చేయటానికి నాయకులు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారని తెలిపారు. అయితే, అసంతృప్తుల గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎందుకంటే అసంతృప్తులు లేకపోతే అది చెల్లని పార్టీ అని అందరు అనుకుంటారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. వచ్చే జనవరిలో విజయవాడలో భారీ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించబోతున్నామని, అంబేద్కర్ ఆశయ సాధనలో వైసీపీ ఎప్పుడూ ముందు వరుసలో ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
BRICS: బ్రిక్స్ కోసం ఢిల్లీలో భారీ భద్రత.. యాంటీ-డ్రోన్ వ్యవస్థలు, భవనాలపై స్నైపర్లు
-
Supreme Court: ‘చేపల్లా కుక్కేస్తున్నారు’.. ప్రైవేటు హాస్టళ్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు
-
Jinping: బ్రిక్స్ సదస్సుకు వస్తున్న జిన్‌పింగ్.. సోషల్ మీడియాలో చైనా పోస్ట్
-
Red Fort Blast: ఎర్రకోట ఉగ్రదాడి కేసు.. హిందూ ఆలయమే తొలి టార్గెట్..?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?