Holiday: మొహర్రం ఏ రోజు.. సెలవు జూన్ 25నా.. జూన్ 26నా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సరం అత్యంత పవిత్రమైన మొహర్రం మాసంతో ప్రారంభమవుతుంది. చంద్రుని దర్శనాన్ని బట్టి గల్ఫ్ దేశాలలో జూన్ 16న, భారతదేశంలో జూన్ 17న ఈ నెల మొదలైంది. ఈ మాసంలో అత్యంత కీలకమైన ‘ఆషూరా’ (మొహర్రం 10వ రోజు) వేడుకలను సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలు జూన్ 25న పాటిస్తుండగా, భారత్‌లో జూన్ 26న నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వ సెలవు ..
భారతదేశంలో జూన్ 26ను కేంద్ర ప్రభుత్వం గెజిటెడ్ సెలవు దినంగా ప్రకటించింది. దీనివల్ల ఆ రోజున బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, పోస్టాఫీసులు, స్టాక్ మార్కెట్లు మూతపడతాయి. శుక్రవారం సెలవు కావడంతో శని, ఆదివారాలతో కలిపి ఉద్యోగులకు, విద్యార్థులకు మూడు రోజుల సుదీర్ఘ వారాంతపు విరామం (లాంగ్ వీకెండ్) లభిస్తుంది. అయితే గోవా, గుజరాత్, హర్యానా వంటి కొన్ని రాష్ట్రాల అధికారిక సెలవుల జాబితాలో ఈ దినం ఉండదు. ఇస్లాంలో అత్యంత పవిత్రమైన నాలుగు నెలల్లో మొహర్రం ఒకటి. ఈ రోజును వివిధ వర్గాల వారు భిన్నమైన చారిత్రక నేపథ్యాలతో స్మరించుకుంటారు.
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
సున్నీ సమాజం: పూర్వం ఈజిప్ట్ రాజు ఫరో అరాచకాల నుండి మూసా ప్రవక్త (మోసెస్) మరియు అతని అనుచరులను దేవుడు రక్షించిన రోజుగా దీనిని భావిస్తారు. ఈ కృతజ్ఞతతో వారు మొహర్రం 9, 10 రోజుల్లో ఉపవాసాలు ఉంటూ, ప్రత్యేక ప్రార్థనలు మరియు దానధర్మాలు చేస్తారు.
షియా సమాజం: కర్బలా మైదానంలో అధర్మానికి వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలర్పించిన ప్రవక్త ముహమ్మద్ మనవడు ఇమామ్ హుస్సేన్ అమరత్వాన్ని ఈ కాలంలో గుర్తుచేసుకుంటారు. ఈ మాసంలోని మొదటి పది రోజులను వారు శోకదినాలుగా పరిగణిస్తూ, నల్లని వస్త్రాలు ధరించి, ప్రత్యేక సంతాప సభలు, ఊరేగింపులు నిర్వహిస్తారు. దీనిని తెలుగు రాష్ట్రాల్లో కొందరు ‘పీర్ల పండుగ’గా కూడా పిలుస్తారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!