Pawan Kalyan Deeksha: మళ్లీ దీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan Deeksha: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరోసారి దీక్ష చేపట్టారు.. ప్రతి ఏడాది చేపట్టే ఆధ్యాత్మిక దీక్షను ఈసారి కూడా ప్రారంభించారు. మంగళగిరిలోని శ్రీ పానకాల లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక అర్చనలు నిర్వహించి దీక్షను స్వీకరించారు. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో ప్రారంభమయ్యే ఈ దీక్షను కార్తీక మాసంలో విరమించడం పవన్ కల్యాణ్ ఆచారంగా కొనసాగిస్తున్నారు. గురుముఖత ద్వారా పొందిన మంత్రోపదేశాన్ని ఆచరణలో పెట్టేందుకు ఈ దీక్షను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు.
దీక్షా కాలంలో పవన్ కల్యాణ్ నియమిత జీవన విధానాన్ని పాటిస్తూ సాత్వికాహారాన్నే స్వీకరిస్తారు. విధి నిర్వహణకు అనుగుణంగా వస్త్రధారణ కొనసాగించినప్పటికీ, ఎక్కువగా చందన వర్ణ దుస్తులను ధరిస్తుంటారు. అలాగే ప్రతిరోజూ దేవతారాధన, అనుష్ఠానాలు, ధ్యానం, మంత్ర పారాయణం చేస్తూ ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమవుతారు.ప్రజా జీవితం, రాజకీయ బాధ్యతల మధ్య కూడా ఆధ్యాత్మిక సంప్రదాయాలను కొనసాగిస్తూ పవన్ కళ్యాణ్ ప్రతి ఏడాది ఈ దీక్షను చేపట్టడం విశేషంగా నిలుస్తోంది.
Also Read
- YSRCP: పింఛన్ల పంపిణీపై వైసీపీ ఫిర్యాదు.. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
- CM Chandrababu : 'అర్నాబ్' తుఫాన్ నష్టం రూ.4,563 కోట్లు.. రైతులకు రూ.6 వేల సాయం
- AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
- School Holiday in AP: ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఏపీలో రేపు కూడా 9 జిల్లాల్లో స్కూళ్లకు సెలవు!
ఎప్పటిలాగే దీక్ష చేపట్టిన శ్రీ @PawanKalyan గారు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు బుధవారం ఉదయం మంగళగిరిలో శ్రీ పానకాల స్వామికి అర్చనలు చేయించి దీక్ష చేపట్టారు. ఏటా జ్యేష్ఠ మాసంలో ప్రారంభించి, కార్తీక మాసంలో దీక్ష విరమిస్తారు.
గురుముఖత స్వీకరించిన… pic.twitter.com/bcFk5W2s5O— JanaSena Party (@JanaSenaParty) June 24, 2026
తాజావార్తలు
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?