Golconda Hostel Incident : గోల్కొండ హాస్టల్లో షాక్.. బాత్రూంలో ప్రసవం, శిశువు మృతి!
- బాత్రూంలో విద్యార్థిని ప్రసవం
- నవజాత శిశువు మృతి ఘటన కలకలం
- కుటుంబ సభ్యుల అనుమానాలు
- హాస్టల్ యాజమాన్యంపై ప్రశ్నలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Golconda Hostel Incident : నగరంలోని గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక ప్రైవేట్ జూనియర్ కళాశాల హాస్టల్లో అత్యంత విషాదకర, దిగ్భ్రాంతికర ఘటన వెలుగుచూసింది. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థిని హాస్టల్ బాత్రూంలో ప్రసవించగా, నవజాత శిశువు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పై అంతస్తు నుంచి కిందకు విసిరివేత?
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, బాత్రూంలో ప్రసవం జరిగిన అనంతరం నవజాత శిశువును భవనం పై అంతస్తు నుండి కిందకు పడేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తీవ్ర గాయాలపాలై శిశువు మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే తీవ్ర రక్తస్రావంతో ఉన్న విద్యార్థినిని వైద్యం కోసం నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతోంది. మృతి చెందిన శిశువు దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
Also Read
- Hyderabad: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య..
- Hyderabad: రాజేంద్రనగర్ పరిధిలో భారీ పేలుడు శబ్దం.. ఇళ్లపైకి పరుగులు తీసిన ప్రజలు.. అసలు ఏం జరిగింది?
- Hyderabad Crime: కంచన్‌బాగ్‌లో దారుణం.. మయన్మార్ మహిళపై సామూహిక లైంగిక దాడి..!
- Arnab Cyclone Alert: 'అర్నబ్' తుఫాన్ ఎఫెక్ట్.. ఈ రాష్ట్రాలకు హెచ్చరికలు.. తెలంగాణాలోనూ భారీ వర్షాలు!
బావపై అనుమానం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు
బాధిత యువతి గర్భం దాల్చడానికి గల కారణాలపై పోలీసులు ప్రాథమిక విచారణ జరిపారు. సదరు విద్యార్థిని తన సొంత బావ కారణంగానే గర్భవతి అయి ఉండవచ్చని ఆమె కుటుంబ సభ్యులు బలంగా అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అయితే పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి విచారణ అనంతరం అసలు నిజాలు వెలుగులోకి రానున్నాయి.
హాస్టల్ యాజమాన్యం నిర్లక్ష్యంపై ప్రశ్నలు
తమ హాస్టల్లో ఉంటున్న ఓ విద్యార్థిని ఇన్ని నెలలుగా గర్భవతిగా ఉన్నప్పటికీ, ఆ విషయం కళాశాల యాజమాన్యానికి లేదా వార్డెన్‌కు తెలియకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హాస్టళ్లలో ఉండే విద్యార్థుల ఆరోగ్యం, వారి రోజువారీ సంక్షేమంపై పర్యవేక్షణ ఎంతవరకు జరుగుతోందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. హాస్టల్ యాజమాన్యం , సిబ్బంది నిర్లక్ష్యంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
కేసు నమోదు చేసిన గోల్కొండ పోలీసులు
ఈ ఘోర ఉదంతంపై కళాశాల ప్రిన్సిపాల్ పర్వీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోల్కొండ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విద్యార్థిని కోలుకున్న తర్వాత ఆమె నుంచి పూర్తి వివరాలు సేకరించనున్నారు. ఈ సంఘటనతో తోటి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన, దిగ్భ్రాంతి నెలకొంది.
తాజావార్తలు
-
Dhanush: విజయ్ బాటలో ధనుష్.. పొలిటికల్ ఎంట్రీకి రెడీ!?
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి మరో బిగ్ ట్రీట్.. మళ్లీ అప్పుడే ప్లాన్ చేశారా?
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!
ట్రెండింగ్
-
Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
-
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!
-
Government Jobs Rules: ప్రభుత్వ ఉద్యోగార్థులకు బిగ్ అలర్ట్.. ఈ చిన్న తప్పులు చేస్తే లైఫ్ లాంగ్ బ్యాన్ కావడం ఖాయం!
-
OLED డిస్ప్లే, iPadOS 27 ఆపరేటింగ్ సిస్టమ్, A20 Pro చిప్సెట్తో Apple iPad mini (2026) విడుదల..!
-
11,000mAh భారీ బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో HONOR X9e Pro విడుదల..!