AP Capitals: మూడు రాజధానుల వ్యవహారంపై చర్చ కొనసాగుతూనే ఉంది.. మరోసారి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. సుప్రీం కోర్టు తీర్పునకు లోబడే సీఎం వైఎస్ జగన్ వైజాగ్ వెళ్తారని తెలిపారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. బుగ్గన వ్యాఖ్యలు వికేంద్రీకరణకు మద్దతుగానే ఉన్నాయన్నారు.. ఏదేమైనా మూడు ప్రాంతాల అభివృద్ధి మా లక్ష్యం.. ప్రధాన వ్యవస్థలు మూడు ప్రాంతాల్లో పెడతాం. మరింత మెరుగైన విధంగా చట్టం తెస్తామని వెల్లడించారు.. విశాఖపట్నంలో సెక్రటేరియట్ ఉంటుంది.. అసెంబ్లీ అమరావతిలో.. హైకోర్టు కర్నూల్‌లో ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు సజ్జల.. రాజధాని అనేది మేం పెట్టుకున్న పేరు.. అమరావతిలో మాత్రమే మొత్తం రాజధాని ఉండాలనుకునేవారు మాత్రమే గందరగోళం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి.. ఎవరూ అస్పష్టత, అపోహలకు గురి కావద్దు.. వికేంద్రీకరణ అజెండాగానే రానున్న ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు.
Read Also: Baba Ramdev: ముస్లింలందరూ ఉగ్రవాదులే.. వివాదాస్పద వ్యాఖ్యలపై బాబా రాందేవ్ క్లారిటీ..
కాగా, విశాఖలో మార్చి 3, 4 తేదీల్లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు నిర్వహించనున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా పలు నగరాల్లో రోడ్ షోలు చేపడుతున్నారు. నిన్న బెంగళూరులో జరిగిన రోడ్ షోలో ఏపీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుడివాడ అమర్నాథ్ పాల్గొనగా.. ఈ సందర్భంగా బుగ్గన.. ఏపీ రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులు అంటూ ప్రజల్లోకి మిస్ కమ్యూనికేట్ అయిందని, ఏపీ పరిపాలన విశాఖ నుంచే జరుగుతుందని.. తద్వారా ఏపీకి విశాఖ ఒక్కటే రాజధాని అనే సంకేతాలిచ్చారు.. ఏపీకి మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ వాస్తవం కాదు.. అందుబాటులో ఉన్న మౌలిక వసతుల పరంగా చూస్తే ఏపీ రాజధానిగా విశాఖే బెస్ట్ అని.. రాష్ట్ర పాలన అంతా విశాఖ నుంచే జరుగుతుంది. మా ప్రభుత్వ నిర్ణయం కూడా అదే అన్నారు.. విశాఖ ఇప్పటికే ఓడరేవు నగరంగా, కాస్మోపాలిటన్ నగరంగా గుర్తింపు పొందింది. భవిష్యత్ లోనూ విశాఖ అభివృద్ధికి ఎంతో అవకాశం ఉందని.. కర్నూలు రెండో రాజధాని కాదు… అక్కడ కేవలం హైకోర్టు ప్రధాన బెంచ్ ఉంటుందంతే… కర్ణాటకలోని ధార్వాడ్, గుల్బర్గాలలో హైకోర్టు బెంచ్ లు ఉన్నాయి. ఏపీలోనూ అంతే అని చెప్పుకొచ్చారు.. ఇక, కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు బెళగాంలో ఒక సెషన్ నిర్వహిస్తారు. అదే విధంగా అసెంబ్లీ సమావేశాలు ఓ సెషన్ అమరావతిలో జరుగుతాయని బుగ్గన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం విదితమే.