Janasena Party: అమరావతిలోని మంగళగిరి జనసేన కార్యాలయంలో ఆ పార్టీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పీఏసీ సమావేశంలో పలు కీలక తీర్మానాలకు ఆమోదం తెలిపారు. ఇటీవల పవన్ విశాఖ పర్యటనపై తీర్మానాన్ని జనసేన పార్టీ ప్రవేశపెట్టింది. పవన్ విశాఖ పర్యటనను అడ్డుకునేందుకు అధికార పార్టీ వైసీపీ వ్యవస్థలను దుర్వినియోగం చేసి భయానక పరిస్థితులను సృష్టించిందని తీర్మానంలో ఆరోపించింది. ఈ చర్యలను…