Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక.. రికార్డ్ స్థాయిలో వరద..!
- ప్రకాశం బ్యారేజీ దగ్గర కొనసాగుతున్న కృష్ణమ్మ దూకుడు..
- ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక..
- రికార్డ్ స్థాయిలో ప్రకాశం బ్యారేజీకి 11.36 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో..
- ప్రకాశం బ్యారేజీకి 2009 నాటి కంటే ఎక్కువగా 15 వేల క్యూసెక్కుల నీరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prakasam Barrage: కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో ప్రకాశం బ్యారేజీకి రికార్డు స్థాయి వరద వచ్చి చేరుతోంది. 11 లక్షల 20 వేల క్యూసెక్కులకు వరద చేరుతుంది. దీంతో ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ఇక, బ్యారేజీలోని 70 గేట్లు ఎత్తి కిందకు వరద నీటిని రిలీజ్ చేస్తున్నారు. బ్యారేజీ చరిత్రలో తొలిసారిగా రికార్డ్ స్థాయిలో వరద వచ్చింది.. 2009 అక్టోబర్‌లో 10 లక్షల 94 వేల క్యూసెక్కుల వరద రాగా.. 1903 వ సంవత్సరంలో 10 లక్షల 60 వేలు క్యూసెక్కుల వరద నీరు వచ్చింది.. ఇక, బ్యారేజీ దిగువ భాగాన అనేక గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి.
Read Also: Rahul Gandhi : ఫేక్ వార్తలపై కాంగ్రెస్ అప్రమత్తం.. దేశవ్యాప్తంగా క్విక్ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటు
Also Read
- Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
- Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
- Off The Record : సైలెంట్ మోడ్ లో కాకినాడ జిల్లా వైసీపీ సీనియర్స్
- CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
కాగా, ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఎత్తి అధికారులు నీటిని రిలీజ్ చేస్తున్నారు. బ్యారేజీ దగ్గర ఎప్పుడు లేని విధంగా 23.6 అడుగుల మేర వరద ప్రవహిస్తోంది. ప్రకాశం బ్యారేజీ ఇన్ ఫ్లో అవుట్ ఫ్లో 11,25,876 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుకుంది. దీంతో రైల్వే అధికారులు అలర్ట్ అయ్యారు. కృష్ణ కెనాల్ జంక్షన్ నుంచి కృష్ణా నది మీదుగా రైళ్లను డెడ్ స్లో చేసి నడుపుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Read Also: Pawan Kalyan Birthday: పవన్ కల్యాణ్ ఫాన్స్‌కు నిరాశ.. అప్డేట్స్ అన్నీ క్యాన్సిల్!
ఇక, ప్రకాశం బ్యారేజీ నుంచి రికార్డు స్థాయిలో వరద నీరు రావడంతో రామలింగేశ్వర నగర్ మునిగిపోయింది. ఇళ్లను ఖాళీ చేసి ప్రజలు బయటకి వెళ్లిపోతున్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణంతో నిన్నటి వరకూ ప్రజలు సురక్షితంగా ఉన్నారు. అయితే, శ్మశానం రోడ్ దగ్గర గోడ పైనుంచి లోపలకు వరద నీరు వచ్చి చేరుతుంది.. మొత్తం వెనక్కి తన్నడంతో నీరు ఇళ్లలోకి చేరుకుంటుంది. ఈ క్రమంలోనే దివిసీమను సైతం వరద తీవ్రత తాకేసింది. పులిగడ్డ దగ్గర 21 అడుగులకు వరద నీరు చేరడంతో.. పులిగడ్డ అక్విడెక్టు నీటిలో చిక్కుకు పోయింది. మోపిదేవి మండలంలోని కే కొత్త పాలెం ఎస్సీ వాడలోకి వరద నీరు రావడంతో కాలనీలో నివాసం ఉంటున్న 600 మందిని పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!