KorianKanakaRaju : భారీ ధర పలికిన ‘కొరియన్ కనకరాజ్’ ఓటీటీ రైట్స్.. షాకిస్తున్న థియేట్రికల్ బిజినెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, డైరెక్టర్ మేర్లపాక గాంధీ కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ ఫన్ అండ్ హారర్ ఎంటర్టైనర్ కొరియన్ కనకరాజు. వినూత్నమైన టైటిల్ ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో అనౌన్స్మెంట్ నుంచే బిజినెస్ వర్గాల్లో ఈ సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది. ఆగస్టు 7న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు మేకర్స్. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన నాన్-థియేట్రికల్, థియేట్రికల్ ప్రీ-రిలీజ్ బిజినెస్ లెక్కలు హాట్ టాపిక్‌గా మారాయి.
సినిమా విడుదలకు ముందే డిజిటల్ రూపంలో మేకర్స్‌కి భారీ డీల్ అయింది. కొరియన్ కనకరాజు డిజిటల్ హక్కులు దాదాపు రూ. 15 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. నాన్-థియేట్రికల్ బిజినెస్ ద్వారా ఇప్పటికే సగం బడ్జెట్ రికవర్ అవ్వడంతో నిర్మాతలు సేఫ్ జోన్లోకి వెళ్లారు. ఇక థియేట్రికల్ హక్కుల విషయానికి వస్తే, రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రీజియన్ల నుంచి మేకర్స్ భారీ మొత్తాన్ని రాబట్టే ప్లాన్‌లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రూ. 5 కోట్ల నుంచి రూ. 6 కోట్ల వరకు రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నైజాం ఏరియాలో థియేట్రికల్ రైట్స్ రూపంలో రూ. 4 కోట్ల వరకు ఆశిస్తున్నారు. సీడెడ్ రీజియన్ నుంచి రూ. 1.5 కోట్ల వరకు బిజినెస్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. అంటే తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ బిజినెస్ రూపంలోనే దాదాపు రూ. 10.5 కోట్ల నుంచి రూ. 11.5 కోట్ల వరకు రాబట్టాలని మేకర్స్ భావిస్తున్నారు. మరి వరుణ్ తేజ్ గత చిత్రాల తాలూకు ఫలితాల దృష్ట్యా మేకర్స్ అడుగుతున్న రేట్ డిస్ట్రిబ్యూటర్స్ కొనుగోలు చేస్తారో లేదో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!