Ram Gopal Varma Sensational Comments On Chandrababu Naidu: వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లోకెక్కే రాంగోపాల్ వర్మ.. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. చంద్రబాబు ఓ నరహంతకుడు అనే పేరుతో యూట్యూబ్‌లో ఒక వీడియో అప్‌లోడ్ చేసిన వర్మ.. అందులో ఆయనపై విమర్శనాస్త్రాలు సంధించాడు. పెద్ద పెద్ద ప్రాంతాల్లో సభలు పెడితే అక్కడికి జనాలు రారని, దాంతో తన పాపులారిటీ తగ్గిపోయిందని అందరికీ తెలిసిపోతుందన్న భయంతోనే.. చంద్రబాబు చిన్న చిన్న ప్రాంతాల్లో సభలు పెడుతున్నారని ఆరోపణలు చేశారు. చిన్న గీత, పెద్ద గీత అనే కాంటెక్ట్స్‌లో.. చిన్న ప్రాంతాల్లో సభలు పెడితే, అది పెద్దదిగా కనిపిస్తుందని చంద్రబాబు భావిస్తున్నారన్నాడు.
Delhi Car Horror: ఢిల్లీ యువతి కేసులో ట్విస్ట్.. అసలు నిధి స్నేహితురాలే కాదట!
ఆ చిన్న ప్రాంతాల్లో నిర్వహించే సభలకు కూడా జనాలు రారన్న భయంతో.. కుక్కలకు బిస్కెట్లు వేసినట్లు, ప్రజలకు కానుకల ఎర చూపించి సభకు తీసుకొచ్చారని వర్మ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కేవలం ఫోటోల కోసం చంద్రబాబు కొంతమందికి బిస్కెట్లు వేసి, అక్కడి నుంచి వెళ్లిపోయారని పేర్కొన్నాడు. తాను మూడుసార్లు సీఎం అయ్యానని చెప్పుకునే చంద్రబాబుకి, ప్రజలంటే ఏంటో తెలీదా? అని ప్రశ్నించాడు. ఇలాంటి చిన్న చిన్న ప్రదేశాల్లో సభలు నిర్వహిస్తే, ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయన్న విషయం తెలీదా? అని నిలదీశాడు. చంద్రబాబుకి ప్రజల ప్రాణాలు గడ్డితో సమానమని, కేవలం స్వప్రయోజనాల గురించి ఆలోచిస్తారే తప్ప, అంతకుమించి ప్రజల సమస్యలు ఆయనకు అవసరం లేదని తెలిప్పాడు. కానుకలు ఇచ్చే సంస్కృతిని చంద్రబాబే ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలుసని.. కానుకలకి, లంచానికి తేడా ఏంటని ప్రశ్నించాడు.
Lady Killer: భర్త ఉద్యోగం కోసం.. ఆ దారుణానికి పాల్పడ్డ మహిళ
ఎంతమంది చనిపోతే, తనకు అంత పాపులారిటీ ఉందని చంద్రబాబు ఫీల్ అవుతారని వర్మ ఆరోపించాడు. తన పాపులారిటీకి జనాల చావుల్ని కొలమానంగా తీసుకోవడం.. నిజంగా హీనమైన చర్య అని అభివర్ణించాడు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు.. చిన్న ప్రాంతాల్లో సభలు పెడితే, అలాంటి పరిణామాలు ఎదురవుతాయని తనకు తెలియదని చెప్పడం కరెక్ట్ కాదని హితవు పలికారు. ప్రజల ప్రాణాల కన్నా తన పాపులారిటీనే చంద్రబాబుకి ముఖ్యమని ఆర్జీవీ నొక్కి వక్కాణించాడు. ఒక రాజకీయ నాయకుడిగా ప్రజల సెక్యూరిటీనే చూడకపోవడమేంటని ప్రశ్నించిన వర్మ.. హిట్లర్, ముస్సోలిని తర్వాత ప్రజల ప్రాణాలతో ఆడుకునే వ్యక్తి చంద్రబాబేనంటూ కుండబద్దలు కొట్టాడు.
Veera Simha Reddy: ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు అనుమతి నిరాకరణ.. అడ్డా మార్చిన బాలయ్య