అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల దుశ్చర్యకు పాల్పడ్డారు. ప్రైవేట్ బస్ ను తగులబెట్టారు మావోయిస్టులు. ప్రయాణీకులను దించివేసి బస్సుకు నిప్పు పెట్టారు మావోయిస్టులు. ఒడిశా నుండి హైదరాబాద్ వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుని చింతూరులో కాల్చివేశారు. ఇవాళ దండకారణ్య బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు అందులో భాగంగానే ఈ దుశ్చర్యకు దిగారని పోలీసులు భావిస్తున్నారు.
ఆంధ్రా సరిహద్దు ఛత్తీస్ ఘడ్ సుక్మా జిల్లా కుంట వద్ద జాతీయరహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు పోలీసు అధికారులు. ఈమధ్యకాలంలో రోడ్ల నిర్మాణానికి ఉపయోగించే పరికరాలను కూడా మావోయిస్టులు తగలబెడుతున్న సంగతి తెలిసిందే. బస్సు తగులబెట్టడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. బంద్ పిలుపు నేపథ్యంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రయాణికులను ప్రత్యేక వాహనాల్లో గమ్య స్థలాలకు చేర్చడానికి ఏర్పాట్లు చేశారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో 25 మంది వరకు ప్రయాణీకులు ఉన్నారు.మావోయిస్టుల చర్యలను ప్రత్యేక్షంగా చూసిన వీరంతా భయాందోళనలకు గురయ్యారు.తాజా ఘటనతో చింతూరు ప్రాంతంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
Read Also IPL 2022: ముంబై ఇండియన్స్ చెత్త రికార్డు.. టోర్నీలో వరుసగా 8వ ఓటమి