అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల దుశ్చర్యకు పాల్పడ్డారు. ప్రైవేట్ బస్ ను తగులబెట్టారు మావోయిస్టులు. ప్రయాణీకులను దించివేసి బస్సుకు నిప్పు పెట్టారు మావోయిస్టులు. ఒడిశా నుండి హైదరాబాద్ వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుని చింతూరులో కాల్చివేశారు. ఇవాళ దండకారణ్య బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు అందులో భాగంగానే ఈ దుశ్చర్యకు దిగారని పోలీసులు భావిస్తున్నారు. ఆంధ్రా సరిహద్దు ఛత్తీస్ ఘడ్ సుక్మా జిల్లా కుంట వద్ద జాతీయరహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది.…