నేడు ఏపీవ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లో బంద్‌కు ఆదీవాసీ సంఘాలు పిలుపునిచ్చాయి. బోయ, వాల్మీకులు, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చడంపై గిరిజనుల్లో వ్యతిరేకత నెలకొంది.
Agency Bandh: బోయ వాల్మీకి, బెంతు ఒరియాలకు ఎస్టీహోదా ఇప్పుడు చిచ్చు రేపుతోంది. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇందుకు నిరసనగా రేపు ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతాల బంద్ కు ఆదివాసీ సంఘాలు పిలుపునిచ్చాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీయేతర రాజకీయ పార్టీలు ఈ ఆందోళనలకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. మరోవైపు, మావోయిస్టు ఈ పరిణామాలపై లేఖ విడుదల చేశారు. ఈస్ట్ డివిజన్ కార్యదర్శి గణేష్ పేరుతో వచ్చిన ఈ లేఖలో ప్రభుత్వ విధానాలను…
అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల దుశ్చర్యకు పాల్పడ్డారు. ప్రైవేట్ బస్ ను తగులబెట్టారు మావోయిస్టులు. ప్రయాణీకులను దించివేసి బస్సుకు నిప్పు పెట్టారు మావోయిస్టులు. ఒడిశా నుండి హైదరాబాద్ వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుని చింతూరులో కాల్చివేశారు. ఇవాళ దండకారణ్య బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు అందులో భాగంగానే ఈ దుశ్చర్యకు దిగారని పోలీసులు భావిస్తున్నారు. ఆంధ్రా సరిహద్దు ఛత్తీస్ ఘడ్ సుక్మా జిల్లా కుంట వద్ద జాతీయరహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది.…