Andhra Pradesh: వైసీపీతో కాంగ్రెస్ పొత్తు ప్రతిపాదన.. జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరతారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహాలపై ఆయన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయాలని.. ఏపీలో మాత్రం వైసీపీతో పొత్తు పెట్టుకోవాలని ప్రశాంత్ కిషోర్ సూచించినట్లు ఓ వార్త షికారు చేస్తోంది.
మరోవైపు ఏపీలో వైసీపీతో కలిసి పీకే పనిచేస్తున్నారు. దీంతో కాంగ్రెస్‌తో పొత్తు విషయాన్ని వైసీపీ నేతల దగ్గర ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే పలుమార్లు వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డితో పీకే చర్చలు జరిపారట. మరి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి వైసీపీ అధినేత జగన్ అంగీకరిస్తారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
Also Read
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలతో విభేదించి బయటకు వచ్చిన జగన్ తనకంటూ ఓ పార్టీ పెట్టుకున్నారు. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి జగన్ ఒప్పుకోరని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. లేకపోతే ప్రశాంత్ కిషోర్ సూచనతో కాంగ్రెస్ పొత్తుకు సై అంటారా అనే విషయం తేలాల్సి ఉంది. అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై పలువురు మంత్రులు, మాజీ మంత్రులు రకరకాలుగా స్పందిస్తున్నారు.
వైసీపీ నాయకత్వంలో మాట్లాడకుండానే ప్రశాంత్ కిషోర్ ఈ ప్రతిపాదన చేసి ఉంటారని వైసీపీ నేతలు భావిస్తున్నారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఓకే అన్నాకే జగన్‌తో మాట్లాడవచ్చని పీకే అనుకున్నారేమోనని పలువురు అభిప్రాయపడుతున్నారు. పీకే ఏపీలో వైసీపీతో కలిసి పనిచేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పొత్తుపై వైసీపీ నాయకత్వాన్ని ఒప్పించవచ్చని భావించి ఉంటారని కొందరు.. గత రెండు ఎన్నికల్లో రాష్ట్రంలో ఉనికే లేని కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోమని పీకే ఎందుకు చెప్పి ఉంటారని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా కాంగ్రెస్‌లో చేరికపై ప్రశాంత్ కిషోర్ ఈరోజు సోనియాగాంధీతో సమావేశం ముగిసిన అనంతరం ప్రకటించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!