YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్… ఇవాళ నేడు ఒంగోలులో పర్యటించనున్నారు. దివంగత వైసీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 11.40 గంటలకు ఒంగోలు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12.05 గంటలకు కాకుమాను రాజశేఖర్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలియజేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు ఒంగోలు నుంచి తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు.
వైసీపీలో కీలకంగా పనిచేసిన కాకుమాను రాజశేఖర్ గతంలో లిడ్‌క్యాప్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. సెప్టెంబర్ 22న డీఎస్సీ నియామకాల్లో అవకతవకలను నిరసిస్తూ విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద వైసీపీ నిర్వహించిన ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. అయితే, ఆందోళన సందర్భంగా జరిగిన తోపులాటలో కాకుమాను తీవ్ర ఒత్తిడికి గురై అస్వస్థతకు లోనయ్యారని పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు ఆరోపించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లిన ఆయన.. అక్కడ తన నివాసంలో గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. మరోవైపు.. కాకుమాను కుటుంబ సభ్యులను ఇప్పటికే ఫోన్లో పరామర్శించిన వైఎస్ జగన్ వారికి ధైర్యం చెప్పారు. నేడు నేరుగా వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించడంతో పాటు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు.
Also Read
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- Ongole: లిఫ్ట్‌లో ఇరుక్కుని మహిళ మృతి..! సీసీటీవీ ఫుటేజ్ వైరల్..
- Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
- CM Chandrababu: వెలిగొండ ప్రాజెక్ట్‌తో దశాబ్దాల కరవు పోతుంది.. అభివృద్ధికి ఓటేయాలన్న చంద్రబాబు
తాజావార్తలు
-
YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Amaravati – Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
-
H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
-
O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
ట్రెండింగ్
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!