Minister Nimmala Ramanaidu: 2026 నాటికి వెలిగొండ పూర్తి చేసి నల్లమల సాగర్‌ను కృష్ణా జలాలతో నింపుతాం..
- 2026 నాటికి వెలిగొండ పూర్తి చేస్తాం..
- నల్లమల సాగర్‌ను కృష్ణా జలాలతో నింపుతాం..
- వెలిగొండ ప్రాజెక్ట్ టన్నెల్ ను పరిశీలించిన మంత్రి నిమ్మల..
- 18 కిలోమీటర్ల లోపలికి వెళ్లి క్లిష్టమైన లైనింగ్ పనులు స్వయంగా పరిశీలన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్ట్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, 2026 నాటికి ప్రాజెక్ట్‌ను పూర్తిచేసి నల్లమల సాగర్‌ను కృష్ణా జలాలతో నింపే లక్ష్యంతో ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. స్థానిక రైతులతో కలిసి వెలిగొండ ప్రాజెక్ట్ టన్నెల్‌లో 18 కిలోమీటర్ల లోపలికి వెళ్లి క్లిష్టమైన లైనింగ్ పనులను స్వయంగా పరిశీలించిన మంత్రి నిమ్మల.. అనంతరం ఇరిగేషన్ అధికారులు, ఏజెన్సీలతో సమీక్ష నిర్వహించారు.
Read Also: Akhanda 2: బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘అఖండ 3’ హింట్ చూశారా!
Also Read
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- Ongole: లిఫ్ట్‌లో ఇరుక్కుని మహిళ మృతి..! సీసీటీవీ ఫుటేజ్ వైరల్..
- Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
- CM Chandrababu: వెలిగొండ ప్రాజెక్ట్‌తో దశాబ్దాల కరవు పోతుంది.. అభివృద్ధికి ఓటేయాలన్న చంద్రబాబు
జగన్ పాలనలో వెలిగొండకు తీవ్ర నష్టం జరిగిందని విమర్శించారు మంత్రి నిమ్మల.. ప్రాజెక్టు నిర్మాణంపై గత ప్రభుత్వ హయాంలో తీవ్ర లోపాలు జరిగాయని మంత్రి ఆరోపించారు. జగన్ ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్ట్‌ను పూర్తికాకుండానే జాతికి అంకితం చేసినట్టుగా ప్రకటించడం “దగా, మోసం” అని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులో ఇంకా రూ.4,000 కోట్ల పనులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, పూర్తయినట్టుగా ప్రకటించడం చరిత్రహీన చర్య అన్నారు.
ఇక, కూటమి ప్రభుత్వం విధులు చేపట్టిన తర్వాత హెడ్ రెగ్యులేటర్ వద్ద 2,200 క్యూబిక్ మీటర్ల కాంక్రీటింగ్ పనులు పూర్తి చేశామని.. కేవలం 18 నెలల్లో 3 కిలోమీటర్ల క్లిష్టమైన టన్నెల్ లైనింగ్ పనులు పూర్తి అయ్యాయని వివరించారు నిమ్మల.. ప్రస్తుతం 4 గ్యాంట్రీలతో రోజుకు 12 మీటర్ల లైనింగ్ పనులు, గ్యాంట్రీల సంఖ్యను మరింత పెంచాలని ఆదేశాలు జారీ చేశాం.. ఫీడర్ కెనాల్‌లో అవసరమైన 45,000 క్యూబిక్ మీటర్ల హార్డు రాక్ పనుల్లో 28,000 క్యూబిక్ మీటర్ల పూర్తి చేశాం.. ఫీడర్ కెనాల్ లైనింగ్, రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ.456 కోట్ల టెండర్లు పూర్తి చేశాం.. టెండర్ పనులు ఈ డిసెంబరు నుంచే ప్రారంభించాలని ఆదేశాలు ఇచ్చాం.. తీగలేరు కెనాల్‌కు సంబందించి 600 మీటర్ల టన్నెల్ లైనింగ్, గేట్ల వ్యవస్థ నిర్మాణం కొనసాగుతుంది అన్నారు..
ఇక, నల్లమలసాగర్ ముంపు ప్రాంతంలో 9.6 కిలోమీటర్ల డైవర్షన్ రోడ్ నిర్మాణం ప్రారంభం అయ్యాయి.. మంథా తుఫాను కారణంగా దెబ్బతిన్న ఫీడర్ కెనాల్ గండ్లు పూడ్చడం, జంట సొరంగాల్లో డీవాటరింగ్ పూర్తి చేసి లైనింగ్ పనులు వేగవంతం చేస్తాం అన్నారు మంత్రి నిమ్మల.. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఇరిగేషన్ రంగం పునరుద్థరణ జరుగుతోంది.. వైఎస్ జగన్ పాలనలో ఇరిగేషన్ రంగం తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం వ్యవస్థను గాడిలో పెట్టిందని నిమ్మల చెప్పారు. వెలిగొండను అత్యంత ప్రాధాన్యత ప్రాజెక్టుగా ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లక్ష్యానికి చేరుకునేలా నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారని వెల్లడించారు. 2026 నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేసి, నల్లమల సాగర్‌ను కృష్ణా జలాలతో నింపుతాం” అని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు..
తాజావార్తలు
-
India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
-
Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Cupid Limited Share Price: కండోమ్‌లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
-
Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!