MLA Tatiparthi Chandrasekhar: ఎక్స్‌లో పోస్టు.. వైసీపీ ఎమ్మెల్యేపై కేసు..
- యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పై కేసు నమోదు..
- ఎక్స్ లో మంత్రి నారా లోకేష్ పై పోస్ట్ లు పెట్టిన ఎమ్మెల్యే..
- టీడీపీ నేత కిషోర్ ఫిర్యాదు.. యర్రగొండపాలెం పీఎస్ లో కేసు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Tatiparthi Chandrasekhar: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు రాజకీయం మొత్తం సోషల్ మీడియా పోస్టుల చుట్టూ తిరుగుతోంది.. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పై కేసు నమోదు చేశారు పోలిసులు.. ఎక్స్ లో మంత్రి నారా లోకేష్ పై ఎమ్మెల్యే చంద్ర శేఖర్ పెట్టిన పోస్ట్‌లపై స్థానిక టీడీపీ నేత కిషోర్ ఫిర్యాదు మేరకు యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. గతంలో.. సర్కారు వారి పేకాటా… రాష్ట్రంలోని పేకాట క్లబ్ ల నుండి వారం వారం కమిషన్ వసూలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. కుమారుడు మంత్రి నారా లోకేష్.. విద్యాశాఖ మంత్రిగా ఉంటూ పేకాట ఆడేలా మౌలిక, సాంఘిక వసతులు ఏర్పాటు చేయడం ధర్మమా లోకేష్ అంటూ Xలో యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ట్వీట్ చేశారు..
Read Also: Hamas : హమాస్‌కు పెద్ద దెబ్బ.. అమెరికా ఒత్తిడి మేరకు ఖతార్ దోహాను విడిచి వెళ్లాలని ఆదేశాలు
Also Read
- Hidden Treasure : అడవిలో అర్థరాత్రి తవ్వకాలు.. గుప్తనిధుల కోసం ఫారెస్ట్ ఆఫీసర్లే వేట.?
- Earthquake In Ongole: ఒంగోలులో భూ ప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు
- Ambati Rambabu: రాజధానిని నిర్మించే స్థాయిలో ఏపీ ఉందా..? అమరావతిపై అంబటి సంచలన వ్యాఖ్యలు
- Markapuram Bus Fire Accident: మార్కాపురం బస్సు దగ్ధం.. బస్సు ఓనర్ కమ్ డ్రైవర్ హరికృష్ణ అరెస్ట్..!
అయితే, ఆ ట్వీట్ కు రియాక్షన్ గా గతంలోనే నోటీసులు జారీ చేసిన పోలీసులు తాజాగా కేసు నమోదు చేసి.. 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే యర్రగొండపాలెం నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని పోలీస్ స్టేషన్లలో పోలీసులు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పై పలు కేసులు నమోదు చేశారు. ఎలక్షన్ సమయంలో పెండింగ్ లో ఫిర్యాదులపై సైతం కేసులు నమోదు చేశారని ఎమ్మెల్యే చంద్ర శేఖర్ వాపోతున్నారు.. అయితే ఇప్పటి వరకు సోషల్ మీడియాలో పోస్టింగులకు పెట్టిన వ్యక్తులపై కేసులు నమోదు చేస్తూ వస్తున్న పోలీసులు మొట్టమొదటిసారి ఓ వైసీపీ ఎమ్మెల్యే పైనే కేసులు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.. ఈ విషయంలో వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.. కాగా, సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన.. మరొకరిని ఇబ్బంది పెట్టేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.. పోస్టులు పెట్టేవారే కాదు.. లైక్‌లు, షేర్లు చేసినా.. గ్రూప్ అడ్మిన్లకు కూడా కష్టాలు తప్పవని వార్నింగ్ ఇస్తున్నారు పోలీసులు..
తాజావార్తలు
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
-
Oppo Reno 16 Series: ఒప్పో రెనో 16 సిరీస్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, కొత్త మ్యాగ్నెటిక్ డిస్ప్లే
-
Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
-
Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
-
సమంతకు ముందే.. గర్భంతో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రసవాన్నే సినిమాలో చూపించారు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!