Balineni Srinivasa Reddy: బాలినేని శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇక వదిలేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balineni Srinivasa Reddy: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం తీవ్ర వివాదంగా మారింది.. దీనిపై పాలక, ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి.. తాజాగా, తిరుమల లడ్డూలో వాడిన నెయ్యి విషయంలో జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని టీటీడీ మాజీ ఛైర్మన్ స్పష్టంగా చెప్పారని ఆయన పేర్కొన్నారు. అయితే, ఆ కల్తీ వ్యవహారానికి తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా స్పష్టం చేశారు. లడ్డూ అంశంపై పదే పదే చర్చించడం వల్ల వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ఈ విషయాన్ని వదిలేయాలని సూచించారు. తప్పు చేసిన వారు ఉంటే వారిని వెంకటేశ్వర స్వామి, సీబీఐ చూసుకుంటారని వ్యాఖ్యానించారు. మరోవైపు, అలాగే జిల్లాలో జనసేన పార్టీ బాధ్యతలను ఎవరికి అప్పగించాలనేది పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయమని తెలిపారు జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.
Read Also: Ghooskhor Pandat : మనోజ్ బాజ్పేయీ ‘ఘూస్ఖోర్ పండత్’ మూవీ టైటిల్‌పై సుప్రీంకోర్టు సీరియస్..
Also Read
- Hidden Treasure : అడవిలో అర్థరాత్రి తవ్వకాలు.. గుప్తనిధుల కోసం ఫారెస్ట్ ఆఫీసర్లే వేట.?
- Earthquake In Ongole: ఒంగోలులో భూ ప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు
- Ambati Rambabu: రాజధానిని నిర్మించే స్థాయిలో ఏపీ ఉందా..? అమరావతిపై అంబటి సంచలన వ్యాఖ్యలు
- Markapuram Bus Fire Accident: మార్కాపురం బస్సు దగ్ధం.. బస్సు ఓనర్ కమ్ డ్రైవర్ హరికృష్ణ అరెస్ట్..!
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్‌పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..