Kakani Govardhan Reddy: నెల్లూరులో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కాకాణి ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వంపై రైతులు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో చంద్రబాబుకు మా నిరసనతో అర్థమైంది అన్నారు. ముఖ్యంగా, ఇటీవల జరిగిన రైతు ఉద్యమాన్ని ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టి వారి పోరును నీరుగార్చాలని చూస్తున్నట్లు తెలిపారు. ప్రతి చోట నోటీసులు జారీ చేయడం, హౌస్ అరెస్టులు విధించడం, కేవలం 15 మందితోనే ర్యాలీ నిర్వహించాలన్న నియమాలను కఠినంగా…
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఒంగోలులో కొన్ని భూకబ్జాలు అయిన విషయంపై విచారణ చేయమని చెప్పాను.. దీని పై సిట్ వేశారు.. గత పదేళ్ళ నుంచి ఈ భూకబ్జాలు జరుగుతున్నాయి.. ఎమ్మెల్యేకు తెలియకుండా జరుగుతాయా అని నాపై విమర్శలు వచ్చాయి.. విచారణ వేగంగా చేసి అనుమానితుల పేర్లు బయట పెట్టమని ఎస్పీ, కలెక్టర్ ను అడిగాను అని ఆయన అన్నారు.
విశాఖపట్నంలో భూకబ్జాలపై సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. విశాఖని రాబంధుల్లా పీక్కుతింటున్నారు వైసీపీ కబ్జాకోరులు అంటూ ఫైర్ అయ్యారు.. కన్నుపడిన ప్రతి గజాన్ని కబ్జా చేస్తూ విశాఖపట్నాన్ని విషాదపట్నంగా మార్చేస్తున్నారని విమర్శించిన ఆయన.. ఏకంగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఎస్పీకి చెందిన స్థలాన్నే వైసీపీ ఎంపీ ఆక్రమించడం వైసీపీ కబ్జాపర్వంలో సరికొత్త కోణం అన్నారు. స్థలం కబ్జా చేయడమే కాకుండా రివర్సులో ఎంపీ మనుషులు ఎస్పీకే వార్నింగ్ ఇవ్వడం విశాఖలో…
శత్రువుకు శత్రువు మిత్రుడు. ఆ నియోజకవర్గంలో రాజకీయ రగడకు అదే కారణమట. అధికారపార్టీ ఎమ్మెల్యేపై వస్తున్న భూ ఆక్రమణల ఆరోపణల వెనక ఎవరున్నారు? టీడీపీ స్వరం పెరగడానికి ఇంకెవరైనా ముడి సరుకు అందిస్తున్నారా? రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? పీలేరులో రూ.400 కోట్ల భూ స్కామ్ జరిగిందని నల్లారి కిశోర్ ఆరోపణ ‘ఇదేలే తరతరాల చరితం..’ అన్నట్టుగా సాగుతున్నాయి చిత్తూరు జిల్లా పీలేరు రాజకీయాలు. ఇక్కడ నల్లారి కుటుంబం వర్సెస్ వైసీపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి…