దొంగలుగా మారిన పోలీసులు.. సీసీ కెమెరాకు చిక్కారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దొంగతనం చేసిన వారిని పట్టుకునే పోలీసులే దొంగతనం చేశారు. అవును మీరు వింటున్నది నిజమే. చిత్తూరు జిల్లాలో పోలీసులు దొంగతనానికి పాల్పడ్డారు. సాక్షాత్తు ఓ ఏఎస్ఐ చేతివాటం చూపించాడు.. అదీ రోడ్డుపక్కనన ఉన్న ఓ చిన్న దుకాణంలో. రాత్రిళ్లు పెట్రోలింగ్ చేసే సమయంలో బట్టల షాపులోకి వెళ్లి చోరీకి పాల్పడ్డారు.. ఆ దృశ్యాలు సీసీ కె మెరాలో రికార్డు అయ్యాయి. కలెక్టరేట్ కు వెళ్లే దారిలో రోడ్డు పక్కన రెండు బట్టల దుకాణాలున్నాయి. రోజంతా వ్యాపారం చేసి రాత్రిళ్లు బట్టలన్నీ మూట కట్టేస్తారు. కొ న్నిసార్లు లోపలే ఏర్పాటు చేసుకున్న మంచంలో పడుకుంటారు. మరికొన్నిసార్లు దుకాణాన్ని పట్టాలతో మూసేసి పోలీసులు పెట్రోలింగ్ చేస్తుంటారనే నమ్మకంతో ఇళ్లకు వెళ్లిపోతారు. ఇలాగే ఈ నెల 4వ తేదీన ఓ షాపు మూసేసి యజమాని ఇంటికి వెళ్లిపోయాడు. ముందే విషయం తెలుసుకున్నారో… అప్పటికప్పుడు షాపులో ఎవరూ లేని విషయాన్ని గమనించారో.. ఇద్దరు పోలీసులు షాపు బయట స్కూటర్ ఆపి లోపలికి వచ్చారు. ఓ పోలీస్ యూనిఫాంలోనే షాపులోకి ప్రవేశించి బట్టల మూట విప్పాడు. ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరైనా గమనిస్తున్నారా అని చూశాడు. ఆ తర్వాత రెండు చేతుల నిండా బట్టలు తీసుకుని వెళ్లిపోయాడు.
ఏఎస్ఐ మూట విప్పి బట్టలు తీసుకునే వరకూ బయట కదలికల్ని గమనిస్తూ మరో పోలీసు ఉన్నాడు. బట్టల్ని తీసుకుని ఇద్దరు కలిసి బైక్‌పై వెళ్లిపోయారు. ఇదంతా షాపు యజమాని లోపల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డయింది. దొంగతనం జరిగిన ఆరు రోజుల తర్వాత సీసీ కెమెరా వీడియో బయట పడింది. వీడియో ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు షాపు యజమాని. షాపులోకి వెళ్లి బట్టలు తీసుకున్నది ఏఆర్ కానిస్టేబుల్ అని.. బయట కాపలాగా సివిల్ డ్రెస్ లో ఉన్న మరో పోలీసు ఏఆర్ ఏఎస్ఐ అని తెలిసింది. పోలీసులే దొంగతనం చేశారని తెలిస్తే డిపార్టహెంట్ ప్రతిష్ట దెబ్బతింటుందని ఉన్నతాధికారులు ఈ విషయాన్ని బయటకు రాకుండా చేశారు.
Also Read
- AP Govt: రైతులకు మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. కేవలం రూ.1.50కే.. జీవో జారీ..
- BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
- RK Roja: మంత్రి లోకేష్‌పై రోజా సంచలన ఆరోపణలు..
- Deputy CM Pawan Kalyan: ఏపీ మారుమూల గ్రామాలకు గుడ్‌న్యూస్.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
తాజావార్తలు
-
M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
-
M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
-
Hyderabad Metro Phase 2: పాతబస్తీ మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బూస్ట్.. ఇక పనుల్లో స్పీడ్..
-
Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..