ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం పూర్తయ్యింది. కీలక స్పిల్ వే నిర్మాణం పూర్తయినట్లు ఈ ప్రాజెక్టు పనులను చేపట్టిన మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. స్పిల్ వేలో 48 రేడియల్ గేట్ల అమరిక పనులు, అదేవిధంగా 98 హైడ్రాలిక్ సిలిండర్ల అమరిక పనులు సైతం పూర్తయ్యాయి. గేట్లను ఎత్తడానికి అవసరమైన 24 పవర్ ప్యాక్ సెట్ల ఏర్పాటు పనులు,10 రివర్ స్లూయిజ్ గేట్ల ఏర్పాటుతో పాటు…