దివ్యాంగులకు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి రోగులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అయితే సదరం సర్టిఫికెట్ కోసం రోజుల తరబడి ఆసుపత్రి చుట్టూ తిరిగినా లాభం లేకుండా పోతుంది..దీంతో నానా అవస్థలు పడుతున్నారు సదరం సర్టిఫికెట్ కోసం ఆసుపత్రికి వచ్చే దివ్యాంగులు.
108 Staff Sincerity: నిజాయితీ చాటుకున్న 108 సిబ్బంది
దివ్యాంగులు జిజిహెచ్ లో సదరం సర్టిఫికెట్ పొందాలంటే ముప్పుతిప్పలు పడాల్సిందే. పరీక్షల పేరుతో బయటకు పంపి వేలల్లో ఖర్చు చేయిస్తున్న ఆసుపత్రి అధికారులు, సర్టిఫికెట్ ఇచ్చేందుకు మాత్రం నెలలు తరబడి తిప్పించుకుంటున్నారు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న దివ్యాంగులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో పరీక్షల కోసం వేలల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆన్ లైన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకున్న వారికి నెల రోజుల్లో అర్హత సర్టిఫికెట్ అందుతుంది. దాన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో కానీ, మీ సేవ సెంటర్ల వద్దకాని తీసుకునే సదుపాయం ఉంది. అయితే సదరం కోసం ఆసుపత్రికి వచ్చే దివ్యాంగులు నెలలు తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆన్ని పరీక్షలు పూర్తయిన సర్టిఫికెట్ విడుదలకు జాప్యం చేస్తున్నారు ఆసుపత్రి ఉద్యోగులు. గత మూడు నెలలుగా అర్హత వున్న 400 పైగా దరఖాస్తులు ఆన్ లైన్ లో అప్లోడ్ చేయకుండా జాప్యం చేస్తున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే… ఆసుపత్రిలో సదరం సర్టిఫికెట్ జారీ చేసేందుకు పరీక్షలకు పరికరాలు, సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తుంది. దీంతో ఆసుపత్రిలో పరీక్షలు నామమాత్రంగానే జరుగుతున్నాయి. చాలామందికి బయట పరీక్షలు చేయించుకుని రిపోర్టులు తీసుకురమ్మని చెబుతున్నారు. అధిక ధరలు పెట్టి పరీక్షలు చేయించుకుని వస్తున్నా, సదరం సర్టిఫికెట్ మాత్రం ఇచ్చేందుకు ఇబ్బందులు గురిచేస్తున్నారు. ఆసుపత్రిలో అధునాతన పరీక్ష పరికరాలు లేకపోవటమే సర్టిఫికెట్ల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి సదరం సర్టిఫికెట్లు త్వరగా వచ్చేలా చూడాలని కోరుతున్నారు ఆసుపత్రికి వచ్చే దివ్యాంగులు.
Booster Dose: శుభవార్త.. ఇంటి వద్దే బూస్టర్ డోస్..!