సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందాలు జోరుగా సాగుతాయి.. ప్రభుత్వాలు వాటిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా సరి.. ఆ సమయానికి చూసిచూడనట్టు వ్యవహరించిన సందర్భాలు ఎన్నో.. గతంలో సంక్రాంతికి ముందు హైకోర్టు.. కోడి పందాలను నిషేధించడం.. దానిని సుప్రీం కోర్టు ఎత్తివేయడం కూడా జరిగిపోయాయి.. అయితే, కోడి పందాల వ్యవహారం మరోసారి హైకోర్టుకు వెళ్లింది.. కోడి పందాలను నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. కోడి పందాలు, జూదం, అక్రమ మద్యం అమ్మకాలు జరపకుండా నిలువరించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు.. ఆ పిటిషన్ హైకోర్టులో రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
Read Also: హైదరాబాద్‌లో ఆర్ఎస్ఎస్ కీలక సమావేశాలు.. కారణం అదేనా..?
కాగా, వందల కోట్ల రూపాయల జూదం కోళ్ల పందాలలో జరుగుతుందనడంలో సందేహం లేదు. జూదం మాట ఎలా ఉన్నా కోడి పందాలలో కత్తులు కట్టడం, పోటీలు పెట్టడం కోళ్లను హింసించే ప్రక్రియ అని భావించిన జంతు సంక్షేమ సంఘం.. గతంలో ఏపీ ఉమ్మడి హైకోర్టులో కోడి పందాలు నిషేధించాలంటూ పిటిషన్ దాఖలు చేయడం.. నిషేధిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం.. సుప్రీంకోర్టు వెళ్లడం.. అక్కడ గ్రీన్ సిగ్నల్ వచ్చిన విషయం విదితమే. అయితే, తాజా పిటిషన్‌పై ఎలాంటి విచారణ జరుగుతోంది.. ఓవైపు సంక్రాంతికి భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి.. ఈ పరిస్థితులలో కోర్టు ఎలా స్పందిస్తోంది అనేది ఆసక్తికరంగా మారింది.