Cyclone Freddy: ఆఫ్రికా దేశమైన మలావి ఫ్రెడ్డీ తుపాను అతలాకుతలమవుతోంది. తుపాను కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఫ్రెడ్డీ తుపాను వల్ల వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇప్పటివరకు 60 మంది మృతదేహాలను గుర్తించారు. నెల రోజుల వ్యవధిలోనే ఫ్రెడ్డీ తుపాను ఆఫ్రికాను రెండు సార్లు అతలాకుతలం చేసింది. తుపాను కారణంగా వరద ఉద్ధృతికి ప్రజలు కొట్టుకుపోతున్నారు. భవనాలు కూలిపోతున్నాయి. ఫ్రెడ్డీ తుపాను దెబ్బకు దక్షిణ, మధ్య ఆఫ్రికా వణికిపోయింది. పలు ప్రాంతాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో నదుల ప్రవాహం ఉద్ధృతంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Read Also:Bombay High Court: మైనర్ వీపును తాకడం లైంగిక వేధింపులా?
ఇప్పటికీ ప్రతికూల పరిస్థితుల కారణంగా, వర్షంతో కూడిన గాలులు తీవ్రంగా వీస్తుండడంతో దక్షిణ, మధ్య ఆఫ్రికాలో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఇక్కడ చాలా వరకు మట్టితో నిర్మించిన నివాసాలే ఉండడంతో అవి కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. తక్షణమే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. చెట్లు కూలి, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. మృతుల సంఖ్య, క్షతగాత్రుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. చెట్లు కూలిపోయి, కొండచరియలు విరిగిపడిన ఘటనలో గాయపడిని వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.