Unstoppable Talk Show: పవన్‌తో బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షో.. బావతో తిరిగే పవన్ బావమరిదితో తిరిగితే తప్పేంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Unstoppable Talk Show: నటసింహ నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్-2 షో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది.. ఇక, తాజాగా ఈ షోలో పాల్గొన్నారు పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈ సందర్భంగా బాలయ్యతో పాటు పవన్ ఫ్యాన్స్ ఫుల్ హంగామా చేస్తున్నారు.. ఇక, పవన్‌ను బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడిగారు..? జనసేనాని సమాధానాలు ఏంటి? ఇటు సినిమా, అటు రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్‌పై బాలయ్య ఎలాంటి ప్రశ్నలు సంధించారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే, ఇదే సమయంలో.. ఈ టాక్ షోపై సెటైర్లు పేలుతున్నాయి.. బాలయ్య, పవన్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు వైసీపీ నేతలు.
Read Also: Pawan Kalyan: మూడు పెళ్లిళ్లపై పవన్ కౌంటర్.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బాలయ్య
Also Read
బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకు పవన్ కల్యాణ్ వెళ్లడంపై స్పందిస్తూ.. ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్నినాని.. బావ(చంద్రబాబు నాయుడు)తో తిరిగే పవన్ కల్యాణ్.. బావమరిది (నందమూరి బాలకృష్ణ)తో తిరిగితే తప్పేముంది? అంటూ ఎద్దేవా చేశారు. ఇక, అన్‌స్టాపబుల్ షో.. పేమెంట్ ప్రోగ్రాం.. ఇద్దరికీ డబ్బులు ఇస్తారు అని వ్యాఖ్యానించిన పేర్నినాని.. ఎవరి డైలాగులు వాళ్లకు ముందే ఇస్తారు అని చెప్పుకొచ్చారు.. మరోవైపు బావ (చంద్రబాబు) కోసం బావమరిది (బాలకృష్ణ) ప్రయత్నం చేస్తున్నారని కామెంట్ చేసిన ఆయన.. బావ కోసం పని చేయటానికి బాలయ్యకు మరో అవకాశం వచ్చిందన్నారు.. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన ఎపిసోడ్ లో ఎన్టీఆర్ కొడుకు అయి ఉండి కూడా చంద్రబాబుకు మద్దతు ఇచ్చాడు అంటూ బాలయ్యపై మండిపడ్డారు పేర్నినాని.
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?