Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Perni Nani Gives Counter To Pawan Kalyan Over Prajarajyam Party Issue

Perni Nani: చిరంజీవి నిఖార్సైన నాయకుడు.. పవన్ వీకెండ్ నాయకుడు

Published Date :September 18, 2022 , 4:36 pm
By Ramesh Nalam
Perni Nani: చిరంజీవి నిఖార్సైన నాయకుడు.. పవన్ వీకెండ్ నాయకుడు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Perni Nani: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. చిరంజీవి రాజకీయంగా చాలా తప్పులు చేసినట్లు పవన్ కళ్యాణ్ మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందని ఆరోపించారు. చిరంజీవి దయతో ఈ స్థాయికి వచ్చిన పవన్ ఆయన్నే తప్పుబడుతూ మాట్లాడుతున్నారని.. తాను చాలా పునీతుడినని అన్నట్లు పవన్ మాటలు ఉన్నాయని పేర్ని నాని ఎద్దేవా చేశారు. 2009లో ప్రజారాజ్యం ఓడిపోగానే యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మళ్లీ కనిపించలేదని.. ఆనాడు ప్రజారాజ్యం పార్టీని పవన్ ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. రాజకీయాల్లో పవన్ చేసినన్ని తప్పులు చిరంజీవి చేయలేదన్నారు.

Read Also: Sangareddy Collector Sharat: కేసీఆర్ అభినవ అంబేద్కర్.. పొగడ్తలతో ముంచెత్తిన కలెక్టర్

2009లో చంద్రబాబును తప్పుబట్టిన పవన్ 2014లో అదే వ్యక్తికి ఓటు వేయమని ప్రజల్ని కోరాడని పేర్ని నాని విమర్శించారు. హైదరాబాద్‌ను విడిచి కట్టుబట్టలతో పారిపోయి వచ్చిన వారిని పవన్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. ప్రజా రాజ్యం పార్టీకి, సొంత అన్నకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి పవన్ అని మండిపడ్డారు. జగన్ మీద పడి ఏడ్వడం తప్ప చంద్రబాబు గురించి ఒక్కరోజైనా పవన్ మాట్లాడారా అని పేర్ని నాని ప్రశ్నించారు. చిరంజీవి నిఖార్సైన నాయకుడు అని.. పవన్ కళ్యాణ్ వారాంతపు నాయకుడు అని చురకలు అంటించారు. పవన్ కళ్యాణ్‌ భ్రమల్లో బతుకుతున్నాడని ఆరోపించారు. ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి తాను గెలిచి తన పార్టీకి 18 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారని.. యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ఏం చేశాడని పేర్ని నాని సూటి ప్రశ్న వేశారు.

పవన్ కళ్యాణ్ ఎక్స్‌పైరీ డేట్ గురించి మాట్లాడుతున్నాడని.. ప్రతి వస్తువుకు, వ్యక్తికి ఎక్స్‌పైరీ డేట్ తరహాలోనే పని తీరుకు ఇండెక్స్ కూడా ఉంటుందని పేర్ని నాని అన్నారు. చంద్రబాబుకు తప్పించి పవన్ వల్ల ప్రజలకు ఏం లాభమని ప్రశ్నించారు. ప్రజారాజ్యాన్ని కొనసాగించాలని అన్న చిరంజీవిని కలిసి ఒక్కసారైనా మాట్లాడావా అని పవన్‌ను నిలదీశారు. పవన్ కళ్యాణ్‌కు కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందని.. ఆయన భూమి ఉన్నంత వరకు ఉండరుగా అని పేర్ని నాని వ్యాఖ్యానించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • ap politics
  • Chiranjeevi
  • JanaSena Party
  • pawan kalyan

తాజావార్తలు

  • Iran-US War: అబ్రహం లింకన్ నౌక నుంచి బయల్దేరిన యుద్ధ విమానాలు.. వీడియో వైరల్

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Ronin Hero Rat: బొరియలు తవ్వడం కాదు.. బాంబులు పసిగట్టడం దీని స్పెషాలిటీ! గిన్నిస్ రికార్డు సాధించిన ఎలుక..

  • MS Dhoni-Rohit Sharma: ముగిసిన ధోనీ, రోహిత్ శకం.. అభిమానుల మదిలో చెరగని ముద్ర!

  • బిర్యానీని లొట్టలేసుకుంటూ తింటున్నారా.. జర ఇది చూడండి..

ట్రెండింగ్‌

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions