సచివాలయంలో గ్రానైట్ పరిశ్రమల నిర్వాహకులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆనాడు పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీని నెరవేర్చారు. గ్రానైట్ పరిశ్రమను ఆదుకునేందుకే స్లాబ్ విధానం తీసుకువచ్చామన్నారు మంత్రి. స్లాబ్ విధానం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 7వేల యూనిట్లకు మేలు జరుగుతుంది. సమగ్ర భూసర్వే కోసం గ్రానైట్ పరిశ్రమ నుంచి సర్వే రాళ్ళను అందించాలన్నారు.
Read Also: Assam: అస్సాం ప్రభుత్వం, తీవ్రవాద సంస్థల మధ్య కీలక ఒప్పందం
వచ్చే డిసెంబర్ నాటికి 30 లక్షల సర్వే రాళ్ళు అవసరం అవుతాయి. సర్వే రాళ్ళ కోసం ఏపీఎండీసీ సొంత యూనిట్లును ఏర్పాటు చేసుకుంది. ఇంకా డిమాండ్ మేరకు సర్వే రాళ్ళు కావాల్సి ఉన్నాయి. వాటిని అందించడం ద్వారా గ్రానైట్ యూనిట్లకు కూడా పని లభిస్తుంది. సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా సమగ్ర భూహక్కు-భూసర్వే నిర్వహిస్తున్నారు. ఈ మహత్తర కార్యక్రమానికి గ్రానైట్ యూనిట్లు కూడా పూర్తి సహకారం ఇవ్వాలన్నారు. మైనింగ్ ఆదాయాన్ని మరింత పెంచేందుకు గనులశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. ఈ సమీక్షలో అధికారులతో పాటు గ్రానైట్ పరిశ్రమలకు చెందిన పలువురు నిర్వాహకులు పాల్గొన్నారు.

Read Also: Students Missing: ఇద్దరు విద్యార్ధుల మిస్సింగ్.. పోలీసుల ఎంక్వైరీ