Pawan Kalyan: ప్రతి కుటుంబం వారంలో ఒకసారి చేనేత వస్త్రాలు ధరించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జనసేన తరపున చేనేత కళాకారులకు కళాభివందనాలు తెలుపుతున్నట్లు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. చేనేత కోసం జాతీయ దినోత్సవం నిర్వహించడం అభినందనీయమన్నారు. కళను నమ్మిన వారు అర్ధాకలితో జీవిస్తుండటం దురదృష్టకరమని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. అయినా వెరవక కొందరు చేనేత కళను సజీవంగా నిలుపుతున్నారని కొనియాడారు. కళారంగంపై లోతైన అధ్యయనం జరగాలని, కళాకారులకు ప్రభుత్వం, ప్రజలు అండగా ఉండాలన్నారు. దేశంలో ప్రతి కుటుంబం వారంలో ఒకసారైనా చేనేత వస్త్రాలు ధరించాలన్నారు. చేనేత వస్త్రాలు ధరించినప్పుడు కలిగే నిడారంబరత, ప్రశాంతత, లాలిత్యం మనసును హత్తుకుంటుందన్నారు.
Read Also: Pawan Kalyan: కేటీఆర్ ఛాలెంజ్‌ను స్వీకరించిన పవన్.. మంత్రికి స్పెషల్ ట్వీట్
Also Read
- Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
- Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
భారతీయ కళలు ప్రపంచంలో ఎంతటి విశిష్ట స్థానాన్ని పొందాయో జగమంతా తెలుసన్నారు. అటువంటి కళల్లో వారసత్వంగా చేనేత కళారంగం విరాజిల్లుతున్నదని.. మన చేనేత కళారంగం ఎంతో సృజనాత్మకమైనదని పవన్ అన్నారు. అటువంటి చేనేత కోసం నేడు జాతీయ దినోత్సవం నిర్వహించుకోవడం ఎంతో ఆనందకరంగా ఉందన్నారు. మన దేశ స్వతంత్ర సంగ్రామంలో చేనేత కూడా ఒక అహింసాయుత ఆయుధంగా ఉపయోగపడిందని పవన్ పేర్కొన్నారు. చేనేత కళాకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడే దాకా ప్రత్యక్షంగా ప్రభుత్వం, పరోక్షంగా ప్రజలు ఈ రంగం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి అండగా ఉండాలని పవన్ అభిప్రాయపడ్డారు. ఇటువంటి గొప్ప సుగుణాలున్న చేనేతకు తన జీవితాంతం బ్రాండ్ అంబాసిడర్‌గా నిలబడతానని పునరుద్ఘాటిస్తున్నట్లు పేర్కొన్నారు. చేనేత కళాకారులు ఆర్ధిక పుష్టి ఆనందకరమైన జీవితాన్ని గడపాలని మనసారా కోరుకుంటున్నట్లు పవన్ ఆకాంక్షించారు.
చేనేత కళాకారులకు కళాభివందనాలు – JanaSena Chief Shri @PawanKalyan#NationalHandloomDay#NationalHandloomDay2022 pic.twitter.com/4k5uux9g1q
— JanaSena Party (@JanaSenaParty) August 7, 2022
తాజావార్తలు
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
ట్రెండింగ్
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!