నాలుగేళ్ల కిందట నేను పోరాట యాత్ర చేస్తున్న సందర్భంలో విశాఖ నగరంలో కలిసిన చిన్నారి ఎస్. రేవతి శివైక్యం చెందిందన్న బాధాకర విషయం నా మనసును తీవ్రంగా కలచివేసింది. పుట్టుకతోనే అతి భయంకరమైన మస్కులర్ డిస్ట్రోపి వ్యాధితో జన్మించిన రేవతి ఒక్క అడుగు కూడా నడవలేని స్థితిలో ఉండేది.. నాలుగేళ్ల కిందట నన్ను ఆ చిన్నారి కలిసేనాటికి ఏడెనిమిదేళ్ళ వయస్సు ఉంటుందనుకుంటా. అటువంటి ఆరోగ్య స్థితిలో కూడా చదువుకుంటూ, సంగీతం నేర్చుకుంటూ ఆ చిన్నారి చూపిన మానసిక ధైర్యం నన్ను అబ్బురపరచింది.
Read Also: Earthquake: అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం..
కొన్ని భక్తి గీతాలు కూడా నా ఎదుట పాడి నన్ను ఎంతో ఆశ్చర్యపరిచింది. ఆమెకు నేను ఇచ్చిన మూడు చక్రాల బ్యాటరీ సైకిల్ పై పాఠశాలకి కూడా వెళ్తుందని, భగవద్గీతలోని 750 శ్లోకాలను కంఠస్థం చేసిందని తెలిసి చాలా ఆనందించాను, అయితే తనకున్న వ్యాధి కారణంగా ఆ చిన్నారి 12 ఏళ్లకే శివైక్యం చెందడం చాలా బాధాకరం. తుది శ్వాస విడిచే సమయంలోనూ భగవన్నామ స్మరణ చేస్తూనే ఉన్న వీడియో మనసును కలచి వేసింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. పుట్టినప్పుడే ఆమె ఎక్కువ కాలం బతకడం కష్టం అని డాక్టర్లు చెప్పినా, 12 ఏళ్లపాటు కంటికి రెప్పలా కాపాడుకున్న రేవతి తల్లిదండ్రులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా అన్నారు పవన్ కళ్యాణ్. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. చిన్నారితో ఉన్న ఫోటో విడుదల చేశారు పవన్ కళ్యాణ్.
Read Also: Taraka Ratna – NTR : ఒకప్పుడు ఇబ్బందుల్లో ఉన్న తారకరత్నకు అండగా నిలిచిన ఎన్టీఆర్