మన సంప్రదాయంలో ఎన్నో విశిష్టతలు వున్నాయి. చనిపోయింది మనిషైనా, చివరికి జంతువైనా దానికి అంతిమ సంస్కారాలు చేయడం పరిపాటి. చనిపోయిన ఒక వానరానికి అంత్యక్రియలు జరిపారు ఓ గ్రామస్తులు. చనిపోయింది కోతే కదా అని వదిలేయలేదు అక్కడి ప్రజలు. దానిని దైవస్వరూపంగా భావించి అత్యంత వైభవంగా అంతిమ యాత్ర నిర్వహించారు.